హిందూపురం: 11 AM స్టేట్‌లోనే రికార్డ్ పోలింగ్‌... బాల‌య్యా ఏం జ‌రుగుతోంద‌య్యా ?

Suma Kallamadi
ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హిందూపురంలో వేగంగా ఓట్లు నమోదవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో 9 గంటలకే 10%, 11 గంటలకే 25 శాతానికి పైగా పోలింగ్ రికార్డు అయింది. ఈ ఓట్లన్నీ నందమూరి బాలకృష్ణ కే పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ వార్ వన్ సైడ్ అయ్యేలాగా కనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నందమూరి బాలకృష్ణ రెండుసార్లు హిందూపురంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మూడోసారి పోటీ చేస్తున్నారు. 2019లో గెలిచాక ప్రతిపక్షంలో ఉన్నా కూడా హిందూపురాన్ని సొంత నిధులతో బాలకృష్ణ డెవలప్ చేశారు. అందుకే ప్రజలు ఆయనపై చాలా అభిమానం చూపిస్తున్నారు. వైసీపీ నుంచి పిల్లి దీపిక ఇక్కడ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆమె గెలుపు కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాగానే కష్టపడ్డారు. క్యాస్ట్ ఈక్వేషన్ ఉపయోగించే ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ ఈ నియోజకవర్గ వాసులను బాలకృష్ణ నుంచి దీపిక వైపు మళ్లించలేకపోయారు. దీనిబట్టి హిందూపురం నందమూరి వారికి కంచుకోట అని మరోసారి నిరూపితం కాబోతుందని తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధర దేవితో కలిసి కొంతసేపటి క్రితమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి టీడీపీ కూటమి కీలక నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనేది ప్రశాంతంగా మారింది. కానీ బాలకృష్ణ విషయంలో మాత్రం వారు వన్ సైడ్ అయిపోయిందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రంతో ఎన్నికలు ముగుస్తాయి. జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికలను రిజల్ట్ డే కాగా ఆ రోజు ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనేది తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీ ఈసారి కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రెండో సారి అవకాశమిస్తే జగన్ ఏపీని ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: