కుప్పంలో భరత్ అనే నేను అంటే బాబోరు పరిస్థితి ఏంటి?
బాబు ఎమ్మెల్యేగా ఉన్నా కుప్పం అభివృద్ధి అంతంత మాత్రమేనని వైసీపీ పాలనలో తమకు పథకాలు అందడంతో పాటు అభివృద్ధి జరిగిందని ఓటర్లు చెబుతున్నారు. వైసీపీ నుంచి ఈ నియోజకవర్గంలో భరత్ పోటీ చేస్తుండగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ భరత్ ప్రజల మద్దతును సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కుప్పంలో భరత్ అనే నేను అని ఓటర్లు అంటే బాబోరి పరిస్థితి ఏంటి అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కుప్పంలో వార్ వన్ సైడ్ అవుతోందని ఆ వన్ సైడ్ కూడా వైసీపీ సైడ్ అవుతోందని తెలుస్తోంది. జూన్ 4వ తేదీన కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు రావడం ఖాయమని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహం అక్కర్లేదని పొలిటికల్ వర్గాల భోగట్టా. గత ఎన్నికల్లో పవన్, లోకేశ్ ఓటమిపాలై షాకిస్తే ఈ ఎన్నికల్లో బాబు అలాంటి షాకిస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా 2 లక్షల మంది ఓటర్లు ఉండగా ఓటర్లలో 80 శాతం మంది వైసీపీ అమలు చేస్తున్న పథకాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాబు పాలనలో ఒక్క పథకం కూడా సరిగ్గా అందలేదని చెబుతున్నారు. భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కుప్పం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందడం ఖాయమని ఇక్కడి ఓటర్లు కామెంట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ కంచుకోటలను బ్రేక్ చేసేలా వైసీపీ వ్యూహాలను అమలు చేసిందని సమాచారం అందుతోంది.