కుప్పం నియోజకవర్గంలో దొంగ ఓటు కలకలం.. ఆ ఆరోపణలు నిజమేనా బాబు?
లక్ష్మీపురం పోలింగ్ కేంద్రంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన గాయత్రి అనే యువతికి అప్పటికే తన ఓటు వేసేశారని చెప్పడంతో ఆమె షాకయ్యారు. తన ఓటు హక్కును మరొకరు వినియోగించుకున్నారని పోలింగ్ అధికారులకు తాను ఫిర్యాదు చేశానని గాయత్రి చెబుతున్నారు. గతంలో కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్ల ద్వారానే గెలిచారని వైసీపీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
కుప్పంలో దొంగ ఓటు కలకలం నేపథ్యంలో చంద్రబాబుపై వినిపిస్తున్న ఆరోపణలు నిజమేనా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ కామెంట్ల విషయంలో చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పోలింగ్ పూర్తయ్యే సమయానికి కుప్పంలో మరిన్ని దొంగ ఓట్లు బయటపడతాయేమో చూడాలి.
గాయత్రి టెండర్ లేదా ఛాలెంజ్ ఓటు ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుండగా ఎన్నికల ఫలితాలు వైసీపీకే ఫేవర్ గా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పోలింగ్ శాతం ఎంత నమోదవుతుందో చూడాల్సి ఉంది. కూటమి, వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కుప్పంలో మాత్రమే దొంగ ఓట్లు బయటపడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమి భయంతో బాబు దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నాడని కామెంటు వినిపిస్తున్నాయి.