ఏపీ: తొలి మూడు గంట‌ల పోలింగ్‌... అధికారం దిశ‌గా జ‌గ‌న్‌... !

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మిగిలిన ప్రాంతాలలో ఎలా ఉన్నా.. గుంటూరు జిల్లాలోని పలనాడు ప్రాంతంలో మాత్రం అధికార వైసీపీ ప్రతిపక్ష కూటమి ఓటర్‌ల్లో పార్టీ కార్యకర్తలు, ఏజెంట్ల మధ్య పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక తొలి మూడు గంటలలో పోలింగ్ జరిగిన సరళి చూస్తుంటే దాదాపు అన్ని జిల్లాలలోనూ సగటున 10 శాతానికి పైగా పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉదయం నుంచే పలు జిల్లాలలో.. పలు పోలింగ్ కేంద్రాలలో.. అభ్యర్థులు బారులు తీరుతూ కనిపిస్తున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల సమాచారం ప్రకారం తొలి 3 పోలింగ్లో అధికార పార్టీ కాస్త పై చేయి సాధించినట్లు కనపడుతుంది. మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు మహిళా ఓటర్లలో ఎవరిని కదిపినా తాము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశామని మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వాన్ని మ‌రోసారి కోరుకుంటున్నామని చెబుతున్నారు. ఈ వర్గాల ఓటర్లందరూ ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని మరీ క‌సితో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.

ఇక 55 సంవత్సరాలు దాటిన వృద్ధులు, మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఎండలో నిలబడి మరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న వాతావరణం అయితే ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ గ్రామీణ ఓటర్లలో ఎక్కువ మంది వైసీపీ వరకు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఓవరాల్ గా చూస్తే తొలి 3 గంటలలో పోలింగ్ సరళిని బట్టి చూస్తే అధికార వైసీపీ కూటమి అభ్యర్థులపై పలు ప్రాంతాలలో ఆధిపత్యం చాటుకుంటున్నట్టు కనిపిస్తోంది. రాయలసీమలోని పల్లి జిల్లాలలో పలు నియోజకవర్గాలలో చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

విచిత్రం ఏంటంటే గోదావ‌రి జిల్లాల ల‌తో పాటు అటు విశాఖ సిటీ.. ఇటు ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ వైపే ఉన్న‌ట్టు చెపుతున్నారు. అమ‌రావ‌తి ప్రాంతంలోనూ వైసీపీ అంచ‌నాల‌కు మించి పెర్పామ్ చేస్తోంద‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: