ఏపీ ఎన్నిక‌ల వేళ వైఎస్సార్ పేరు.. ఇదో మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌..?

RAMAKRISHNA S.S.
ఏపీ సీఎం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల‌కు సంబంధించిన కేసుల్లో సీబీఐ నమోదు చేసిన చార్జిషీట్లు సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే..ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ చార్జిషీట్లు కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. చార్జిషీట్ల‌లో వైఎస్ జ‌గ‌న్‌తో పాటు.. ఆయ‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు కూడా ఉంది. ఇది గతంలో నూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో మ‌రింత ఎక్కువ‌గా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

చార్జిషీట్లలో వైఎస్ పేరును కాంగ్రెస్ పార్టీనే చేర్పించింద‌ని.. అలాంటి పార్టీతో క‌లిసి త‌న చెల్లెళ్లు ఇద్ద‌రూ త‌న‌ను బ‌ద్నాం చేస్తున్నార‌ని.. వీరు వైఎస్‌కు వార‌సులు ఎలా అవుతార‌ని.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అయితే.. దీనికి కౌంట‌ర్గా ష‌ర్మిల‌.. అస‌లు వైఎస్ పేరును చేర్పించిందే.. జ‌గ‌న్ అని ఎదురు దాడి చేశారు. పొన్న‌వోటు సుధాక‌ర్రెడ్డి అనే న్యాయ‌వాది చార్జిషీట్‌లో వైఎస్ పేరును చేర్చేందుకు పోరాటం కూడా చేశార‌ని చెప్పారు.

అలాంటి వ్య‌క్తికి జ‌గ‌న్ ఏఏజీ పోస్టును ఎలా క‌ట్ట‌బెట్టార‌న్న‌ది ష‌ర్మిల వాద‌న‌. అయితే.. దీనిపై పొన్న‌వోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి.. త‌న వాద‌న త‌ను వినిపించారు. అయితే.. ఈ వాద ప్ర‌తివాద‌న‌లు. విమ‌ర్శ‌, ప్ర‌తివిమ‌ర్శ‌లు.. రెండూ కూడా ఎన్నిక‌ల ప్ర‌చారానికే ప‌రిమితం కానున్నాయి. ఎందుకంటే.. ఎలానూ చార్జిషీట్ నుంచి వై . ఎస్ పేరును గ‌త రెండేళ్ల కింద‌టే తొల‌గించారు. ప్ర‌స్తుతం ఈ కేసుల్లో ఆయ‌న పేరు లేదు .

కానీ,  మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న ఏంటంటే.. ఎవ‌రు చేర్చారు?  చార్జిషీట్ల‌లో వైఎస్ పేరు చేర్చి.. ఆయ‌న‌ను కూడా బ‌ద్నాం చేయాల‌ని ఎవ‌రు భావించారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. తాజాగా ఏపీకివ‌చ్చిన రాహుల్ కూడా.. తాము చేర్చ‌లేదని చెప్పారు. జ‌గ‌న్ కూడా.. త‌మ‌కుఆఅవ‌స‌రం లేద‌న్నారు. మ‌రి ఎవ‌రు చేర్చిన‌ట్టు?  ఇదొక మిస్ట‌రీ.. !  మ‌రోసారి ఎన్నిక‌లు వ‌చ్చినా.. అప్ప‌టి వ‌ర‌కు ఇది అలా న‌లుగుతూనే ఉంటుంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో వ‌న‌రుగా మారుతూనే ఉంటుంది. ఎందుకంటే.. ఇవ‌న్నీ.. రాజ‌కీయ ప్రేరేపితాలు కాబ‌ట్టి.. ! !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: