విజ‌య‌వాడలో ఎవ‌రు గెలుస్తారు... చివ‌ర్లో టాక్ మారిపోయిందే..?

RAMAKRISHNA S.S.
పోలింగ్‌కు మ‌రొక్క రోజు ముంగిట‌.. నాయ‌కుల త‌ల‌రాత‌లు మారిపోయే అవ‌కాశం ఎప్పుడూ ఉంటుంది. ఖ‌చ్చితంగా మారిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. విజ‌యవాడ సెంట్రల్‌లో ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ హ‌వా క‌నిపించిన ఈ నియోజ‌క‌వ ర్గంలో అనూహ్యంగా ప్లాన్ మారింది. మాస్ ఏరియాల్లో ఇప్పుడు టీడీపీ మాట వినిపిస్తోంది. అర్బ‌న్‌లో మాత్రం వైసీపీ మాటే వినిపి స్తోంది. ఇక‌, క్లాస్ ఏరియాల్లో మాత్రం త‌ట‌స్థులు ఎక్కువ‌గా ఉన్నారు.

గ‌త రెండు వారాల కిందటివ‌ర‌కు కూడా.. సెంటిమెంటుతో అయినా.. రాజ‌కీయాలు చేయాల‌ని భావించిన వైసీపీకి ఇప్పుడు ఒకింత ఎదురీత క‌నిపిస్తోంది. సీఎం జ‌గ‌న్‌పై రాయిదాడి త‌ర్వాత‌.. ఇక్క‌డ టీడీపీ డిఫె న్స్ లో ప‌డిపోయింది. అయితే.. రెండు వారాల త‌ర్వాత‌. వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో ప‌రిస్థితి మ‌ళ్లీ మారిపోయింది. టీడీపీ వ్య‌తిరేక‌త స‌మ‌సిపోగా.. వైసీపీలో ఇప్పుడు అసంతృప్తి పెరిగింది. మాస్ ఏరియాలో టీడీపీ నేత‌లు అంద‌రినీ అక్కున చేర్చుకుంటున్నారు.

కానీ, ఈ త‌ర‌హా వ్యూహంలో వైసీపీ నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యారు. పైగా వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు.. ఇంకా జ నాల‌కు క‌నెక్ట్ కాలేకపోయారు. పోలింగ్ ముందు వ‌ర‌కు కూడా.. ఏదో ఒక‌ర‌కంగా సెంటిమెంటుతోనే ముం దుకు సాగాల‌ని భావించిన ఆయ‌న‌కు ప‌రిస్థితులు అయితే.. ఆశించిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు తాడేప‌ల్లికే ప‌రిమితం అయ్యారు. ఇది కూడా వెల్లంప‌ల్ల‌కి ఒకింత ఇబ్బందిగా మారింది. సో ఎలా చూసుకున్నా.. కూడా సెంట్రల్‌లో టాక్ అయితే మారింది.

ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రినోట విన్నా.. ముఖ్యంగా మాస్ ఏరియాలో టీడీపీ మాటే వినిపిస్తోంది. బోండా ఉమానే గెలుస్తార‌ని చ‌ర్చ సాగుతోంది. దీనికితోడు ఎంపీ ఓటు కూడా కేశినేని చిన్నికే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అయితే.. చిత్రం ఏంటంటే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇలానే బొండా ఉమా పేరు వినిపించింది. కానీ, తీరా పోలింగ్ రోజున మాత్రం ఈక్వేష‌న్లు మారిపోయాయి. బ‌ల‌మైన పోటీ ఏర్ప‌డి 25 ఓట్ల తేడాతో వైసీపీ నేత విజ‌యంద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు బొండా ఉమా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: