ఏపీ:కూటమి గెలిస్తే 30లక్షల మంది రోడ్డున పడాల్సిందే.!

Pandrala Sravanthi
 ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుకుంది.  ఇంకా కొన్ని గంటల్లో ఎలక్షన్ మొదలవుతుంది. దీంతో అభ్యర్థులంతా  లోలోపల వణుకుతూనే,  బయటకి మేమే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే  టిడిపికి కూటమితో కలిసి పోటీ చేస్తున్న గాని లోలోపల మాత్రం భయం గానే ఉందట.  ఇక వైసిపి సింహం సింగిల్ గా వస్తుందంటూ ఎలాంటి పొత్తు లేకుండా టిడిపికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ తరుణంలోనే  చాలా సర్వేలు వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాయి. ఇది మింగుడు పడని టిడిపి కూటమి  విపరీతంగా డబ్బులు, ప్రలోభాలు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారట. 

కానీ ఏపీ ప్రజలు మాత్రం మేము వైసీపీ వెంటే ఉంటామని తెగేసి చెబుతున్నారట. అంతేకాకుండా  టిడిపి గెలిస్తే రాష్ట్రంలో జగన్  ప్రజల కోసం తీసుకువచ్చినటువంటి ఎన్నో పథకాలు ఆగిపోతాయి. ప్రధానంగా చెప్పుకునేది ఇళ్ల పట్టాలు.  దాదాపుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించి, వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొంతమంది  ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్ని కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. ఇంకా ఎవరికి కూడా  పూర్తిస్థాయి ఇల్లు అందించలేదు. మళ్లీ వైసీపీ గెలిస్తే ఈ 30 లక్షల మందికి కొత్త ఇల్లు మంజూరు అవుతాయి.

ఇదే తరుణంలో టిడిపి ప్రభుత్వం  అధికారంలోకి వస్తే మాత్రం ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలు రద్దవ్వడమే కాకుండా, పేద ప్రజలు విపరీతంగా నష్టపోతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇళ్ల పట్టాలే కాకుండా ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరియు ఇప్పటివరకు పేదలకు భూములు పంపిణీ జరిగిన విధానంపై పూర్తిస్థాయిలో  రివ్యూ చేస్తామని టిడిపి ప్రకటించింది. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపు 17 లక్షల మందికి పైగా, అసైన్డ్ భూములు, ఇతర భూముల్లో పట్టాలు అందించారు. టిడిపి అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అందించిన భూములను కూడా రద్దు చేసే అవకాశం ఉందని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే తరుణంలో ఈ లబ్ధిదారులంతా ఏ వైపు ఉంటారనేది చాలా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: