ఏపీ : మేనిఫెస్టోతో మోసం చేస్తున్న చంద్రబాబు..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో మే 13 జరగబోయే ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.శనివారం నాడు ప్రచార చివరి రోజు చిలకలూరిపేటలో జరిగిన ప్రసంగంలో చంద్రబాబుపై విమర్శలు, తాను గత ఐదేళ్లులో చేపట్టిన పథకాలను మాత్రమే ప్రస్తావించారు. తాను 132 సార్లు బటన్‌ నొక్కటం ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలసాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని సీఎం జగన్ అన్నారు. పొరపాటున ఆయనకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని చెప్పారు. "59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం. మన మేనిఫెస్టోను నేరుగా ఇళ్లకే పంపి ఆశీస్సులు తీసుకున్నాం.'సూపర్ సిక్స్' పేరుతొ చంద్రబాబు మేనిఫెస్టో కేవలం పేపర్ ప్రింట్లో మాత్రమే ఉంటుందని ఆచరణకు వీలుకని హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని జగన్ అన్నారు. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే." అని సీఎం పేర్కొన్నారు. ఖాతాలకు చెల్లింపులు జరిగాయని అన్నారు.టిడిపి అధినేతచంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఏ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిందే లేదని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు.గతంలో ఏ పాలకులు ఇవ్వని విధంగా రెండు లక్షల ముప్పై ఒక వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. వారంతా మీ ముందే సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్నారని అన్నారు.

చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో కు సంవత్సరానికి దాదాపు లక్ష 65 వేల కోట్లు ఖర్చు అవుతాయి.అంత మొత్తం సంవత్సరానికి జనాలకు ఇవ్వడం సాధ్యం కాదు, వీలు కాదు అని వారికి తెలుసు. అయిన ఆ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఒక వేళ వారు గెలిచినట్లు అయితే మళ్లీ చంద్రబాబు నాయుడు చేతికి కత్తి ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసినట్లే అవుతుందని అన్నారు.
2014లో చంద్రబాబు అమలు చేస్తానన్న మేనిఫెస్టో చెత్తబుట్టలో వేశారన్నారు. రైతులకు రుణమాఫీ,పొదుపు సంఘాలకు  సంబంధించి రద్దు చేస్తానని చెప్పి చేయలేదని గుర్తు చేసారు.మహాలక్ష్మి పథకం కింద ఆడపిల్ల పుడితే రూ.25 వేలు బ్యాంకులో వేస్తామని ఇప్పటి వరకు వేయలేదన్నారు. అర్హులైన పేదలకు మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఒక్కసెంటు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు మళ్లీ సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రతి ఇంటికీ బెంజ్‌ కార్‌ ఇస్తామని, బంగారం ఇస్తామని వస్తున్నారని, వారు మాయమాటలు విని మోసపోవద్దని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: