ఓటు: రెండు చోట్ల వెయ్యొచ్చా? వేస్తే ఏంటి పరిస్థితి?

Purushottham Vinay
•రెండు చోట్ల ఓటు వేస్తే తిప్పలు తప్పవు
•రెండు చోట్ల ఓటు వెయ్యడం చట్టరీత్యా నేరం
•రెండు చోట్ల ఓటేస్తే శిక్షలు తప్పవు

ఇండియా హెరాల్డ్: దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన 4వ దశ ఓటింగ్ అనేది మే 13 వ తేదీన జరగనుంది. ఈ క్రమంలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతుంది.అలాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు చాలా చోట్ల వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.అయితే కొంత మంది మాత్రం ఓటర్ల పేర్లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి, రెండు ఓటరు కార్డులు కలిగి ఉంటారు. ఇలాంటి క్రమంలో వారు రెండు చోట్ల తమ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చా?, ఒకవేళ ఉపయోగించుకుంటే అసలు ఏమవుతుంది? అసలు ఈ విషయం పై చట్టాలు ఏం చెబుతున్నాయనే విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

మాములుగా ఒక వ్యక్తికి ఒక ఓటరు కార్డు మాత్రమే ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ప్రజలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి ఓటరు కార్డు కోసం అప్లై చేస్తే వారికి రెండు చోట్ల రెండు ఓటరు కార్డులు లభిస్తాయి. అందువల్ల వారికి రెండు ఓటరు కార్డులు ఉంటాయి. కానీ రెండు ఓటరు కార్డులు ఉంటే ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం ఏదైనా కేవలం ఒకటి మాత్రమే వినియోగించుకోవాలి.రెండో ఓటు కార్డు పరిగణలోకి తీసుకోరు. అందుకే ఎవరికైనా రెండు ఓటరు కార్డులు ఉంటే అందులో ఒక దానిని వినియోగించుకొని ఇంకొక దానిని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. వాటిలో పౌరుడు ఒక ఓటు హక్కును మాత్రమే వినియోగించుకోవాలి. రెండు చోట్ల ఓటు వేస్తే అది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం అవుతుంది.ఒక వ్యక్తికి రెండు ఓటరు కార్డులు ఉన్నట్లు తేలితే గనుక అది ఎన్నికల సంఘంలోని రూల్ 17ను ఉల్లంఘించినట్లే.

అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా రెండు ఓటరు కార్డులతో కనిపిస్తే ఖచ్చితంగా వారికి చట్టం ప్రకారం సంవత్సరం పాటు జైలు శిక్ష విధించబడుతుంది. రెండు ఓటింగ్ కార్డుల వ్యవహారం ఇప్పటికే చాలా చోట్ల పరిష్కారమవుతోంది. కానీ కొందరికి ఇంకా పెండింగ్ ఉన్నట్లైతే వారు ఓటింగ్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం మొత్తం జనాభా ఏకంగా 140 కోట్లు దాటింది. వీరిలో దాదాపు 80% మంది ఓటు హక్కుని కలిగి ఉండగా, గణాంకాల ప్రకారం కేవలం 70% మంది మాత్రమే ఓటు హక్కును కలిగి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: