టీవీ: 19 ఏళ్లకే వివాహం చేసుకున్న సింగర్ సునీత.. తెలియని విషయాలు ఇవే..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. తన స్వీట్ వాయిస్ తో ఎంతోమందికి తన వైపు తిప్పుకుంది.. ఏన్నో చిత్రాలలో పాటలు పాడడమే కాకుండా ఎంతో మంది హీరోయిన్లకు కూడా డబ్బింగ్ చెప్పి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సునీత కెరియర్ పరంగా ఎన్నో అవార్డులను సైతం అందుకొని అరుదైన గౌరవాన్ని కూడా పొందింది. కానీ తన పర్సనల్ జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది సునీత..

సింగర్ సునీత రెండవ వివాహం చేసుకున్నప్పుడు పలు రకాల రూమర్స్ ఈమె పైన ఎక్కువగా వినిపించాయి. వీటివల్లే ఈమె క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. సింగర్ సునీత మొదటి భర్త ఎవరు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈమె తన మొదటి భర్తను ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. అది కూడా తన 19 ఏళ్ల వయసులోని వివాహం చేసుకుంది 17 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడిన సింగర్ సునీత.. భర్త పేరు కిరణ్.. మొదట తనే వచ్చి సునీతకి ప్రపోజ్ చేసిన ఆమె ఒప్పుకోలేదట.. దాదాపుగా ఒకటిన్నర ఏడాది తర్వాత సింగర్ సునీత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా అతడు కూడా ఇండస్ట్రీకి చెందిన వాడు కావడం చేత సునీత ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే సునీత కుటుంబ సభ్యులకు మాత్రం ఇతడితో వివాహం నచ్చలేదట.. అలా సునీత కిరణ్ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరి వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి వీరికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. మొదట్లో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడం చేత కొద్ది రోజులు అడ్జస్ట్ అయిన చివరికి విడిపోయే పరిస్థితి ఏర్పడిందట. అలా సునీత తన కొడుకు కూతురుతో ఒంటరిగానే జీవించిందట.తన కొడుకు ప్రస్తుతం ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కూతురు శ్రియా కూడా సింగర్ గా ఎంట్రీ ఇవ్వాలని పలు ప్రయత్నాలు చేస్తోంది. లాక్ డౌన్ సమయంలో మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేని వివాహం చేసుకుంది సింగర్ సునీత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: