విశాఖ‌కు జ‌గ‌న్‌... వైసీపీ ప్ర‌భుత్వమే క‌రెక్ట్ అంటోన్న టీడీపీ శ్రీ భ‌ర‌త్‌... !

Divya
ఒక్కోసారి ప్ర‌త్య‌ర్థి పార్టీల వారు వాస్త‌వాన్ని ఒప్పేసుకుంటూ అవ‌త‌లి వైపు పార్టీల‌ను పొగ‌డ‌డం కామ‌న్‌గా జ‌రుగుతుంటుంది. కొంద‌రు నిజాయితీగా ఇలా ఓపెన్‌గానే మాట్లాడితే.. మ‌రి కొంద‌రు మాత్రం మ‌న‌సులో ఉన్న‌ది కావాల‌నో... లేదా పొర‌పాటునో లేదా ప‌రోక్షంగానో ఓపెన్ అయిపోతూ ఉంటారు. విశాఖ ఎంపీగా కూట‌మి నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తోన్న బాల‌య్య చిన్న‌ల్లుడు శ్రీభ‌ర‌త్ కూడా ఇప్పుడు ఇలాగే మ‌రి నిజాయితీతో చెప్పారో లేదా పొర‌పాటున ఒప్పుకున్నారో విశాఖ గ్రోత్ ఇంజ‌న్ అనేది వైసీపీ ప్ర‌భుత్వం.. అందులోనూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ల్లే అన్న‌ది చెప్ప‌క‌నే ఆయ‌న మాట‌ల్లో చెప్పేసిన‌ట్లైంది.

విశాక ఏపీకి గ్రోత్ ఇంజ‌న్ అవుతుంద‌ని.. అందుకే తాను ఇక్క‌డ ప‌రిపాల‌నా రాజ‌ధాని పెట్టాల‌ని అనుకుంటున్న‌ట్టు సీఎం జ‌గ‌న్ నాలుగేళ్లుగా చెపుతూనే వ‌స్తున్నారు. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నైతో పోటీప‌డాలంటే ఒక్క విశాఖ వ‌ల్లే అవుతుంద‌ని.. తాను రెండోసారి సీఎం అయ్యాక విశాఖలోనే ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని చెప్పేశారు. టీడీపీకి విశాఖ రాజ‌ధాని అవ్వ‌డం ముందు నుంచి ఇష్టం లేదు. టీడీపీకి రాజ‌ధాని అమ‌రావ‌తే కావాలి.

ఇక భ‌ర‌త్ కూడా విశాఖే ఏపీకి గ్రోత్ ఇంజ‌న్ అవుతుంద‌ని.. అమ‌రావ‌తికి ఒక రూపురేఖ‌లు రావాలంటే చాలా టైం ప‌డుతుంద‌ని చెప్పేశారు. ఈ మాట టీడీపీకి ఓ విధంగా షాకింగ్ లాంటిదే. ఇప్ప‌టికే ఏపీ చాలా అప్పుల్లో ఉంది.. భ‌ర‌త్ అన్నీ విధాలా ఆలోచించే అస‌లు వాస్త‌వం ఒప్పుకున్నార‌ని కొంద‌రు విశ్లేష‌కులు చెపుతున్నారు. అయితే టీడీపీ వ‌ర్గాల‌కు ఇది మింగుడు ప‌డ‌డం లేదు. భ‌ర‌త్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తూ వైసీపీ జ‌గ‌న్ చేసిన ప‌నిపై పరోక్షంగా అయినా పొగ‌డ్త‌లు కురిపించ‌డం వాళ్ల‌కు న‌చ్చ‌డం లేదు.

ఇక చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా తాను అన్న‌ది వేరు.. మీడియా చూపించింది వేరు అని భ‌ర‌త్ వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేసినా అప్ప‌టికే అది ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: