ఇద్దరు భార్యలున్నవారికి శుభవార్త... ఏకంగా రూ.2 లక్షలు?

Suma Kallamadi
షాకింగ్ గా ఉన్నా మీరు ఇక్కడ విన్నది నిజమే. అవును, ఇద్దరు భార్యలు ఉంటే జాక్ పాట్ తగిలినట్టేనని కాంగ్రెస్ నేత కాంతిలాల్ భూరియా తాజాగా చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెనుదుమారాన్నే సృష్టిస్తున్నాయి. తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం మహాలక్ష్మి పథకం కింద గృహిణికి యేడాదికి రూ.లక్ష నగదు బ్యాంకు ఖాతాలో జమ కానుండగా అదే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే యేడాదికి రూ.2 లక్షలు పొందొచ్చుకదా అని ఆయన ఆడిన మాటలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేశాయి. కేంద్ర మాజీ మంత్రి అయిన కాంతిలాల్ భూరియా గురువారం ఎన్నికల ప్రచారంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోల్స్ కి గురవుతున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాత్లం నుంచి లోక్‌సభ ఎంపీగా బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మహాలక్ష్మి పథకం గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం అని సొంత పార్టీ నాయకులే సంజాయిషీ చెప్పుకొనే పరిస్థితి వచ్చింది. ఇంకేముంది, కట్ చేస్తే... ఈ వ్యాఖ్యలపై ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఈ రకమైన మాటలు ఆడడం కొత్తేమి కాదని, దేశ ఆచార సంప్రదాయాలను మంటగలపడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని ధ్వజమెత్తారు. భారత దేశ సంస్కృతిలో వివాహ వ్యవస్థకి ఒక సముచిత స్థానం ఉందని, దానిని అవహేళన చేసేలా మాట్లాడేవారి పట్ల తగిన చర్యలు తీసుకుంటామని బీజేపీ కాంతిలాల్ భూరియాని ఉద్దేశించి హెచ్చరించింది.
ఇకపోతే కాంతిలాల్ భూరియా భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. ఈయన జూలై 2011 వరకు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేసారు. 2009లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ -2 ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి స్థాయికి పదోన్నతి పొందాడు. అంతకు మునుపు అతను వ్యవసాయ మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రిగా మరియు రాష్ట్ర మంత్రిగా పని చేయడం జరిగింది. అంతే కాకుండా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజాపంపిణీకి నాయకత్వం వహించాడు. అతనితో పాటు అతని వారసుడు, కొత్త గిరిజన వ్యవహారాల మంత్రి వి కిషోర్ చంద్ర డియో మరొక కాంగ్రెస్‌ వాది కావడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: