మంగళగిరి: లోకేష్ ను ఓడించడానికి భారీ స్కెచ్ వేసిన వైసిపి..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు ప్రజలను సైతం చాలా ఉత్కంఠ పరిచేలా చేస్తున్నాయి. ఓటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది నేతలు కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈసారి చాలామంది నేతలకు సైతం ఎన్నికలు చాలా క్లిష్ట పరిస్థితిలో పడేసేలా చేస్తున్నాయి.. అందుకే చాలామంది నేతలు సైతం ఈసారి గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ తమ నియోజకవర్గాలలో భారీగానే డబ్బులు పంచేల ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు మంగళగిరిలో గతంలో ఓడిపోయారు ఇప్పుడు మళ్లీ అదే సీట్లు తీసుకొని గెలవాలని పట్టుదలతో ఉన్నారు.

అక్కడ వైసీపీ మహిళా నేత మురుగుడు లావణ్య పోటీ చేస్తోంది. ముఖ్యంగా ఈమెకు ఆమెకుల సామాజిక వర్గంలో మంచి ప్రాధాన్యత ఉంది. తాజాగా మంగళగిరిలో పరిస్థితుల విషయానికి వస్తే వైసిపి పార్టీ నుంచి ఓటుకు నాలుగువేల రూపాయలు పంచుతున్నారని టిడిపి పార్టీ వాళ్లు కేవలం 3000 రూపాయలు పంచుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయం పైన లోకేష్ మాట్లాడుతూ మనం బాగా పనిచేస్తే భారీ మెజారిటీతో గెలుస్తామని 4000 రూపాయలు పంచాల్సిన అవసరం లేదని.. వైసీపీ వాళ్లు ముందుగా 4000 రూపాయలు పంచి ఒకవేళ అవసరమైతే మరో రెండు వేల రూపాయలు అదనంగా పంచాలని ఫిక్స్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే గతంలో లోకేష్ కూడా ఎన్నికలలో అమరావతిని బాగా డెవలప్ చేశామంటూ చెప్పుకొచ్చారు.. అయినప్పటికీ ఓటుకు కేవలం 2000 రూపాయలు ఇచ్చి వదిలేశారు.. దీంతో అక్కడ స్వల్ప తేడా అయినా 5000 వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మళ్లీ ఇప్పుడు మంగళగిరిలో టిడిపి పార్టీ కంటే వైసీపీ పార్టీని డబ్బు పంపిణీ విషయంలో ఒక మెట్టు కాస్త ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.. మరి గెలవడం కోసం లోకేష్ బాబు మరొకసారి వైసీపీ పార్టీ కంటే అదనంగా డబ్బు పంచుతారా లేకపోతే సైలెంట్ గా ఉంటారా అనే విషయం చూడాలి.. మరి మంగళగిరిలో తన విజయకేతాన్ని ఎగరవేస్తారు లేదా చూడాలి మరి లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: