ఏపీ: నేతలను భయపెడుతున్న రెండు సర్వేలు.. ఆ పార్టీదే హవా..!

Divya
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలు సైతం పోలింగ్  కేవలం మరో రెండు రోజులు సమయం మాత్రమే ఉన్నది. దీంతో అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా ప్రచారం వైపుగా దూసుకుపోతున్నారు.. ప్రజలకు తమ మేనిఫెస్టోలో ఉన్న పథకాల గురించి వివరిస్తూ అన్ని పార్టీలు కూడా అభ్యర్థుల ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. ఎన్నికలలో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయం గురించి గత కొద్దిరోజుల నుంచి పలు రకాల సర్వేలు తెలియజేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా రెండు సర్వే రిపోర్ట్ లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా ఎలక్ట్రోరల్ , పాలిమెట్రిక్స్ అనే రెండు సర్వే సంస్థలు సైతం పలు రకాల రిపోర్టులను తెలియజేశాయి.. ఇందులో ఎలక్ట్రోరల్ సర్వే మాత్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పార్టీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని తెలియజేసింది.. కూటమిలో భాగంగా 55 నుంచి 60 స్థానాలు వస్తాయని తెలిపింది.. ఓటింగ్ శాతం విజయానికి వస్తే 50% వైసీపీ పార్టీకి.. కూటమికి 48.5% అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక శాతం మాత్రమే వస్తాయని తెలిపారు.

ఇదంతా ఇలా ఉంటే పాలిమెడ్రిక్  సర్వే రిపోర్ట్ ప్రకారం వైసీపీ పార్టీని అధికారంలోకి వస్తుందంటూ తెలిపింది. ఈ సర్వే రిపోర్ట్ లో కూడా వైసిపి పార్టీకి 115 సీట్లు వస్తాయని వెల్లడించారు.. కూటమికి 60 స్థానాలు వస్తాయని.. అయితే ఇందులో కొన్ని వాటిలో టఫ్ ఉందని కూడా తెలియజేస్తోంది ఈ సర్వే.. మరి ఈ రెండు సర్వేల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఒకవేళ ఆంధ్రాలో వైసిపి పార్టీనే మరొకసారి అధికారంలోకి రాబోతోందని చెప్పవచ్చు. మరి మొత్తానికి అయితే జూన్ 4వ తేదీ ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందని విషయం తేలిపోతుంది. ఇటు వైసిపి నేతలలో ఆనందం కనిపిస్తూ ఉంటే అటు కూటమి నేతలలో కాస్త నిరుత్సాహం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: