పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన.. స్టార్ హీరోయిన్..!

Divya
టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ యామి గౌతమ్.. అయితే మొదట ఈ ముద్దుగుమ్మ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఆ తర్వాత రవిబాబు నటించిన నువ్విలా సినిమాతో తెలుగు తేరకు హీరోయిన్గా పరిచయమైంది. ఆ వెంటనే అల్లు శిరీషతో గౌరవం, నితిన్ తో ఒక సినిమా నటించింది.. తెలుగులో సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది యామి గౌతమ్.

అలా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఈ రోజున ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఇప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్ ద్వారానే తన పిల్లాడి పేరును కూడా తెలియజేసింది.. యామి గౌతమ్ 2021లో ఉరి :ది సర్జరీకల్ స్ట్రైక్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. మూడేళ్లు వైవాహిక బంధానికి ఒక బిడ్డ కూడా ఇటీవలే జన్మనిచ్చారు. తన కుమారుడి పేరు వేదవిద్ అని తెలియజేసింది.

వేద విత్ అనే పేరుకు అర్థం వేదాల పరిజ్ఞానం ఉన్నవాడు అన్నట్లుగా తెలియజేశారు. అలాగే విష్ణువు అనే పేరు కూడా వస్తుందట. ఈ విషయం తెలుసుకున్న అభిమానుల సైతం ఈ జంటకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మా ముద్దుల కొడుకు వేదవిద్ ను పరిచయం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ప్రతి ఒక్కరు ఆశీర్వాదం కావాలి అంటూ తెలియజేస్తోంది ఈ జంట. ప్రస్తుతం అందుకు సంబంధించి యామి గౌతమ్ తన ట్విట్టర్ నుంచి షేర్ చేసిన ఒక పోస్ట్ సైతం వైరల్ గా మారుతున్నది. ఇటీవలే ఆర్టికల్ 370 సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: