ఆ తమిళ డైరెక్టర్ తో సినిమాకి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి ధీటుగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ తన కూతురు నిర్మాణ సంస్థ తో ఒక సినిమాను ప్రకటించాడు. అయితే తాజాగా ఆ సినిమాకి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం.

 కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మొదటి ఈ సినిమా వస్తుంది అన్న ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత సినిమాకు సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ కూడా బయటికి రాలేదు. తాజాగా ఇప్పుడు మోహన్ రాజాకు ఈ ప్రాజెక్టు అప్పగించినట్లు.గా తెలుస్తోంది. చిరంజీవి సైతం సినిమా స్టోరీ విని  చేయడానికి ఒప్పుకున్నట్లు గా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మోహన్ రాజా చిరంజీవి దర్శకత్వంలో ఇది మొదటి సినిమా కాదు.  గతంలో వీరిద్దరి కాంబినేషన్లో గాడ్ ఫాదర్ సినిమా

 వచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను అంత పెద్ద స్థాయిలో అలరించలేకపో యినప్పటికీ చిరంజీవికి బాగానే కలిసొచ్చింది. ఇక చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇప్పుడు ఒక భారీ సన్నివేశాన్ని భారీ సెట్ లో తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అంతేకాదు ఈ షెడ్యూల్లో నే పాటలను కూడా చిత్రీకరిస్తున్నట్లు గా తెలుస్తోంది.  జూలై నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా వినికిడి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నవంబర్ వరకు అన్ని పనులను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: