రాయలసీమ: ఆ ఒక్క వైసీపీ నేతతో.. టిడిపి పార్టీకే వణుకు..!

Divya
ఏపీ ఎన్నికల ఫలితాల కోసం అటు వైసిపి కూటమి అభ్యర్థులు అధినేతలు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా ఉభయ  గోదావరి జిల్లాలో ఎవరు ఎక్కువ స్థానాలు గెలిస్తే వారిదే అధికారం అన్నట్లుగా కొనసాగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు టిడిపికి మరొక సెంటిమెంటు కూడా ఉన్నది.. అదేమిటంటే అనంతపురం జిల్లా ఉరవకొండలో టిడిపి పార్టీ గెలిస్తే ఆ పార్టీకి అధికారం అసలు దక్కదు గతంలో ఇది ఎన్నోసార్లు కూడా రుజువయింది.

2004, 2009 ఉరవకొండలో టిడిపి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గెలిచారు. దీంతో టీడీపీ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైనది. 2014లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి అక్కడ విజయాన్ని అందుకోగా టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో పయ్యావుల కేశ ఉరవకొండలో గెలవగా అధికారం కోల్పోవడం జరిగింది. ఇక ఈసారి కూడా పోరు పయ్యావుల వర్సెస్ విశ్వేశ్వర్ రెడ్డి అని జరుగుతూ ఉన్నప్పటికీ.. గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం రాదని సెంటిమెంట్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఒక్క వైసీపీ గెలుపు కోసం చాలామంది టిడిపి నేతలు కోరుకుంటున్నారు.

ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సైతం టిడిపి పార్టీని షేక్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి పయ్యావుల కేశవ్, విశ్వేశ్వర్ రెడ్డి  సీట్ల మధ్య ఆంధ్రప్రదేశ్లో సెంటిమెంట్ ఉన్నది. మరి ఈసారి ఉరవకొండ ప్రజలు ఎవరికి జై కొట్టారు ఇక్కడ గెలిచిన అభ్యర్థి అధికారంలోకి  తీసుకువచ్చి సెంటిమెంట్ ను తిరగ రాస్తారేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం అటు రాయలసీమ నేతలను కూడా ఆందోళనకు గురయ్యాలా చేస్తోంది. ఇటీవలే పార్టీ అధినేతలు సైతం ఇతర ప్రాంతాలకు వెళ్లి కాస్త రిలాక్స్ అవుతూ ఉన్నారు.. జూన్ 4వ తేదీన కౌంటింగ్ సమయానికి అందరూ తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఉండాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: