ఏపీ: ఎన్నికలవేళ సంచలన ఘటన.. ఏకంగా హోంమంత్రి పైనే దాడి..!

Divya
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటీ వనిత పైన పలువురు టిడిపి కార్యకర్తలు దాడి చేయడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. నిన్నటి రోజున రాత్రి హోం మంత్రి వనిత తను బస చేస్తున్న ఇంటిపైన కొంతమంది టిడిపి కార్యకర్తలు దాడి చేసినట్లుగా సమాచారం.. అయితే ఈ దాడిలో పలువురికి గాయాలు కావడమే కాకుండా ఫర్నిచర్ ధ్వంసం అయ్యిందని ఈ దాడికి సంబంధించిన పలు దృశ్యాలు కూడా అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్నటి రోజున రాత్రి తూర్పుగోదావరి జిల్లాలో నల్లజర్ల లో వనిత ప్రచారం చేస్తోందట.

ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన డిజే ను సైతం కొంతమంది అక్కడున్న టిడిపి నేతలు అడ్డుకోవడంతో అటు టిడిపి వైసిపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఆ తర్వాత ప్రచారం ముగించుకొని తానేటి వనిత స్థానిక వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకొని టిడిపి అభ్యర్థి వెంకటరాజు బాపిరాజు ఇద్దరు కూడా వైసిపి నేత సుబ్రహ్మణ్యం ఇంటిలో బస చేస్తున్న హోంమంత్రి వనిత పైన దాడి చేయడానికి ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ టిడిపి వైసిపి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇందులో పలువురు వైసీపీ నేతలకు గాయాలైనట్టుగా సమాచారం. వెంటనే పోలీసులు సమాచారం తెలియడంతో ఇరువురు వర్గాలను కూడా చెదరగొట్టారు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ మొహరించారు. ఈ విషయం పైన హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ టిడిపి నేతలకు ఓటు భయం పట్టుకుంది అంటూ అందుకే ఇలాంటివి చేస్తున్నారు అంటు తెలుపుతోంది. మహిళా అని చూడకుండా దాడికి ప్రయత్నించడం సిగ్గుచేటు అంటూ స్వయంగా హోంమంత్రి పై టిడిపి అభ్యర్థి దాడి చేయడం ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే విధంగా ఆమె ఆరోపిస్తోంది. అందుకు సంబంధించి పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: