ఏపీ: రాజం"పేటకు" నేనే మేస్త్రి.!!
• ప్రభుత్వ వ్యతిరేకత సుబ్రహ్మణ్యం కు కలిసి వస్తుందా.?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజంపేట నియోజకవర్గం చాలా కీలకంగా మారింది. ఇక్కడ వైసిపి, టిడిపి మధ్య హోరాహోరీ పోటీ ఏర్పడింది. పోటీలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమే. అలాంటి రాజంపేటలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు.. వారి బలాలు, బలహీనతలు ఏంటి అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
ఇక రాజంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన మొదటిసారిగా 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి విజయం సాధించారు. 2014లో ఓడిపోయారు. 2019లో ఆయనకు వైసిపి టికెట్ దక్కలేదు. అలాగే టిడిపి అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఈయన బలిజ సామాజిక వర్గానికి చెందినటు వంటి నాయకులు. ఈయన తండ్రి పాలకొండ రాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ ఎస్సీ, బీసీ, ఓటర్లే కీలకంగా ఉంటారు. ఇక్కడ బీసీ ఓట్లు 88వేలు, ఎస్సీ, ఎస్టీ 70వేలు, బలిజ సామాజిక వర్గానికి 35వేలు, రెడ్డి, ముస్లింలు కలిపి 43వేలు ఉంటాయి.
ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి:
బలాలు:
నవరత్నాలు పథకాలు.
గతంలో అభివృద్ధి పనులు. వైయస్ చేసిన అభివృద్ధి.
బలహీనతలు.
మేడ టిడిపి సపోర్టు.
అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితుల ఓట్లు.
ఉద్యానవదన పంట పరిశ్రమలు రాకపోవడం.
సుగావాసి సుబ్రహ్మణ్యం.
బలాలు:
అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితుల ఓట్లు.
బలిజ సామాజిక వర్గం.
గల్ఫ్ కుటుంబాల ఓట్లు.
బలహీనతలు:
స్థానిక అభ్యర్థి కాకపోవడం.
చంగల్ రాయుడు వ్యతిరేకత.