టీడీపీలో ఇదేం రొద‌రా బాబు... బాబోరికి కొత్త క‌ష్టం..?

RAMAKRISHNA S.S.
 అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
చంద్ర‌బాబు ఇలా చేసి ఉంటే.. బాగుండేదా? - చంద్ర‌బాబు ఇంకొంచెం ఆలోచించి ఉంటే బాగుండేదా?  ఇదీ.. ప్ర‌స్తుతం తెలుగు దేశం పార్టీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న లోతైన చ‌ర్చ‌. మేనిఫెస్టో ప్ర‌క‌టించిన త ర్వాత‌.. స‌హజంగానే.. పార్టీలో ఉత్సాహం పోటెత్తాలి. కానీ, ఆదిశ‌గా టీడీపీలో అయితే ప‌రిస్థితి క‌నిపించ‌లే దు. దీనికి కార‌ణం.. టీడీపీ మేనిఫెస్టో.. అంటే.. అభివృద్ధికి దిక్సూచిగా మారుతుంద‌ని అంద‌రూ ఊహిం చుకోవ‌డ‌మే. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. దీంతో ఇప్పుడు టీడీపీలో రొద మొద‌లైంది.

టీడీపీకి సానుకూలంగా ఉన్న మేధావి వర్గాలు ఎప్ప‌టి నుంచో త‌ప్పు ప‌డుతున్న వైసీపీ ప‌థ‌కాల‌ను తాజా గా కూటమి కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది. వైసీపీ ఇస్తామ‌న్న ప‌థ‌కాల‌కు రెండింత‌లు ఇస్తా మ‌ని చెప్పింది. ఇది.. మేధావి వ‌ర్గాల‌నే కాదు.. ఎన్నారైల‌లో ఉన్న సింప‌తీని కొంత దెబ్బ‌తీసింది. చంద్ర‌బాబు వంటి విజ‌న్ ఉన్న నాయ‌కుడి నుంచి ఈ రెండు వ‌ర్గాల‌తో పాటు ఎగువ‌ మ‌ధ్య త‌ర‌గ‌తి , ఉన్న‌త స్థాయి వ‌ర్గాలు.. చాలానే ఎక్స్ పెక్ట్ చేశాయి.

ముఖ్యంగా అమ‌రావ‌తి వంటి రాజ‌ధానిని న‌వ‌న‌గ‌రాల‌ను అభివృద్ధి చేస్తార‌ని అనుకున్నారు. కానీ, ఈ ప్ర‌స్తావ‌న‌ను మేనిఫెస్టోలో త‌గ్గించారు. కేంద్రం సాయంతో చేస్తామ‌న్నారు కానీ, కేంద్రం ఇప్ప‌టికే తాము ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చేశామ‌ని.. రాజ‌ధాని విష‌యం రాష్ట్ర ప్ర‌బుత్వానిదేన‌ని చెప్పింది. ఇది పార్లమెంటులో చెప్పిన మాట‌. బ‌య‌ట ఎన్ని చెప్పినా.. పార్ల‌మెంటులో చెప్పిందే శాస‌నం. సో.. అమ‌రావ‌తికి కేంద్రం నుంచినిదులు ఎక్స‌పెక్ట్ చేయ‌డం త‌ప్పిద‌మే అవుతుంది.

ఇక‌, విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా చంద్ర‌బాబు రాష్ట్రానికి ఆదాయం పెంచుతామ‌ని చెబుతున్నారు. కానీ, అది ఎలా ? అనేది చెప్ప‌డం లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాలన్నీ. కూడా పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డంలో పోటీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చే ఉచితాలు త‌గ్గించాల‌నేది ప్ర‌ధాన సూత్రం. ఇటీవల తెలంగాణ ప్ర‌భుత్వం మూసీ న‌దిఅభివృద్ధికి సంబంధించి.. బ్రిట‌న్ సంస్థ‌తో ఒప్పందం చేసుకుంది. కానీ, అక్క‌డి ప్ర‌భుత్వం ష‌ర‌తు విధించింది.

ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణాన్ని ఎత్తేయాల‌ని కోరింది. ఇదంతా ర‌హ‌స్యం. దీనికి రేవంత్ ప్ర‌భుత్వం ఒప్పుకోక‌పోవ‌డం.. స‌ద‌రు సంస్థ అడుగులు ముందుకు వేయ‌క‌పోవ‌డం తెలిసిందే. సో.. ఇవ‌న్నీ గ‌మ‌నించిన త‌ర్వాత‌.. టీడీపీలో రొద మొద‌లైంది. ముఖ్యంగా అండ‌గా ఉన్న మేదావులు.. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా.. మేనిఫెస్టోకు మ‌ద్ద‌తు తెల‌ప‌క‌పోవ‌డం వెనుక ఇదే కార‌ణ‌మ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: