ఏపీ: కుప్పంలో కప్పని ఆడించినట్టు బాబును ఆడిస్తా: లక్ష్మీపార్వతి
ఈ నేపథ్యంలో ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించాలని చేతులు జోడించి మరీ స్థానికులను అడిగారు. కాగా ఈ ప్రచారంలో ఎమ్మెల్సీ భరత్, భరత్ సతీమణి దుర్గ,కుప్పం నియోజకవర్గ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే… భరత్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేయడం ప్రత్యేకతని సంతరించుకుంది. దాంతో స్థానిక వైస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు చప్పట్లు కొట్టారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ... "బాబుగోరు చాలా దొంగ. సొంత మామనే ఎలా చెప్పులతో కొట్టించారో ఈ ప్రపంచానికి తెలుసు. నన్ను ఆయనగారు వివాహం ఆడిన తరువాత బాబు అసలు రంగు బయట పడింది. అంత వరకు మేక వన్నె పులిలా ఉన్న బాబు ఒక్కసారిగా రాక్షసుడిలా మారిపోయారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని మొత్తం నామీదకి ఉసిగొలిపారు. ఆయనపై చెప్పులు వేయించారు. అలాంటి వెన్నుపోటు దారుడు ప్రజలకు ఏం మేలు చేస్తాడు? ఈ సారి బాబు పప్పులు ఉడకవు. ప్రజలు మంచి కసిమీద ఉన్నారని అర్ధం అవుతోంది. కుప్పంలో కప్పని ఆడించినట్టు బాబును ఆడిస్తారు కదా?" అంటూ చెవాక్కులు విసిరింది.