ఆ అభిషేకం జరిపిస్తే జగన్ పార్టీ ఓడిపోతుందా.. పవన్ ఆరోపణల్లో నిజమెంత?

Reddy P Rajasekhar
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చేసే విచిత్రమైన ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంటాయి. పవన్ వ్యాఖ్యలు వాస్తవానికి కిలోమీటర్ దూరంలో ఉండటంతో చాలామంది ఆ ఆరోపణలను నమ్మడానికి అస్సలు ఆసక్తి చూపరు. తాజాగా పవన్ ఒక సందర్భంలో శ్రీశైలం మల్లన్న మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవీ గండం ఉందని అన్నారు.
 
జగన్ ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో జ్యోతిష్యుల మాటలను విశ్వసిస్తున్నారని అందువల్లే శ్రీశైలం మల్లన్న మహా కుంభాభిషేకం రెండుసార్లు వాయిదా పడిందని పవన్ పేర్కొన్నారు. మల్లన్నకు అభిషేకం చేస్తే జగన్ మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ లేదని కొంతమంది జ్యోతిష్కులు చెప్పడంతో అభిషేకం జరగలేదని పవన్ పేర్కొన్నారు. ఎక్కడైనా అభిషేకం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి కానీ నెగిటివ్ ఫలితాలు రావు.
 
కుంభాభిషేకం చేయకపోతే వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని చెబుతున్న పవన్ అదే సమయంలో కుంభాభిషేకం పక్కన పెట్టిన వైసీపీ అధికారంలోకి రాకుండా పోతుందని కామెంట్లు చేశారు. రెండు నాల్కల ధోరణితో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ కామెంట్లు నవ్వు తెప్పిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ వ్యాఖ్యలు అర్ధ రహితమైన వ్యాఖ్యలు అని నెటిజన్లు చెబుతున్నారు.
 
పవన్ కళ్యాణ్ వైసీపీపై ఎలా విమర్శలు చేయాలో తెలియక ఈ తరహా విమర్శలు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ పై విమర్శలు చేయకుండా జనసేన బలోపేతంపై, జనసేన అభ్యర్థుల గెలుపుపై పవన్ దృష్టి పెడితే బాగుంటుందని ఏపీ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. జనసేనతో పవన్ ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నాలను అన్ని పార్టీలు చేసేశాయి. ఇక ఓటర్ల మనస్సు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రజలు కూటమిని నమ్ముతారో వైసీపీని నమ్ముతారో తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: