రాయలసీమ: షర్మిల రాజకీయానికి జగన్ భయపడుతున్నారా..?

Divya
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.. జగన్ తన పైన చేసినటువంటి వ్యాఖ్యలకు అప్పుడప్పుడు అదిరిపోయే కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటుంది షర్మిల. ఇటీవలే దెందులూరు సభలో షర్మిల పాల్గొనడంతో అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు చేతులెత్తేయడంతో చాలా విమర్శలకు గురిచేసింది. పోలీసులు నిర్లక్ష్యం కారణం వల్ల షర్మిల కాన్వాయ్ గంట పైగా ట్రాఫిక్ లో చిక్కుకుందంట. సభ అయిపోయిన వెంటనే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా ఎవరు పెద్దగా అక్కడ కనిపించలేదట.

ఆ ఏరియా ఎస్పీకి మరియు అధికారులకు షర్మిల ఫోన్ చేసి న లిఫ్ట్ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఈ ట్రాఫిక్ ను సైతం క్లియర్ చేసే బాధ్యత తీసుకొని షర్మిల వెళ్లే రోడ్డును కూడా క్లియర్ చేశారట. ఆ తర్వాత జగన్ రెడ్డి పైన షర్మిల కూడా విమర్శలు చేస్తూ మరింత డోస్ పెంచినట్టుగా కనిపిస్తోంది.. అసలు వైయస్ వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదని ఆమె తాజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఈ మాటల వల్ల షర్మిల పైన ఆగ్రహంతోనే ప్రభుత్వ పెద్దలు కూడా ట్రాఫిక్ క్లియర్ చేయలేదంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తన సొంత చెల్లెలు అయినటువంటి షర్మిల పైన జగన్ రెడ్డి కక్షపూరితంగానే ఇలాంటి పనులు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వై నాట్ 175 అంటూ బీరాలు పలుకుతున్న జగన్ షర్మిల రాజకీయానికి బెదురుతున్నారని పలువురు కాంగ్రెస్ నేతలు తెలియజేస్తున్నారు. షర్మిలను అడ్డుకునే ప్రయత్నాలు ఇకమీదట మానుకోవాలంటే వైసీపీ సర్కార్కు కూడా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈసారి కడప ఎంపీగా వైయస్ షర్మిల అవినాష్ మీద పోటీ చేయబోతోంది. ఈ ఎన్నికలు కూడా చాలా రసవత్తంగానే మారుతున్నాయి.. సర్వేలు కూడా ఓటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది ఏం జరుగుతుందని విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: