బిఆర్ఎస్ హిస్టరీలో.. ఇలా జరగడం ఇదే మొదటిసారి?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల పండుగ కొనసాగుతూ ఉంది.  కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికల జరుగుతుంటే మరికొన్ని రాష్ట్రాలలో పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. తమకు ఓటు వేస్తే ఏం చేస్తాము అనే విషయంపై హామీల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఓటర్లు ఎప్పటిలాగానే తెలివిగా ఆలోచిస్తూ తమకోసం తమ అభివృద్ధి కోసం పాటుపడతాడు అన్న నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే అటు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

 మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో ప్రధాన పోటిదారులుగా చెప్పుకునే బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇక అందరూ అభ్యర్థుల వివరాలను ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక తమ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీలను కీలక నేతలు అందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. కానీ బిఆర్ఎస్ పార్టీలో మాత్రం మొదటిసారి ఒక విచిత్ర కరమైన ఘటన జరిగింది.

 పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా అటు కెసిఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఎంపీగా పోటీ చేయడం చేస్తూ ఉండేవారు. కానీ మొదటిసారి 2024 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కేసిఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేయకపోవడం గమనార్హం. గత 20 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 2001లో బిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత 2004 ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2006, 2008 ఉప ఎన్నికల్లోను విజయం సాధించారు. 2009లో మహబూబ్నగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత నిజాంబాద్ ఎంపీగా గెలుపొందారు. కానీ 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: