ల‌క్ష నుంచి 2 ల‌క్ష‌ల మెజార్టీతో టీడీపీ గ్యారెంటీగా గెలిచే సీటు ఇదే...?

RAMAKRISHNA S.S.
ఏపీలో ప్రీ పోల్ స‌ర్వేల హ‌డావిడి మామూలుగా లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంది?  ఏ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న దానిపై ర‌క‌ర‌కాల అంచ‌నాలు , స‌ర్వేలు వెలువ‌డుతున్నాయి. ఒక్కో స‌ర్వే తీరు ఒక్కోలా ఉంటోంది. కొన్ని స‌ర్వేలు కూట‌మి అధికారం చేప‌డుతుంద‌ని చెపుతుంటే.. మ‌రి కొన్ని స‌ర్వేలు మాత్రం మ‌ళ్లీ సీట్లు త‌గ్గినా కూడా జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని చెపుతున్నాయి. ఎన్ని స‌ర్వేలు ఎలా వ‌చ్చినా అన్ని స‌ర్వేల్లోనూ కొన్ని సీట్ల విష‌యంలో... కొన్ని కామ‌న్ ఫ్యాక్ట‌ర్లు క‌నిపిస్తున్నాయి.

అలాంటి కామ‌న్ ఫ్యాక్ట‌ర్ల‌లో గుంటూరు పార్ల‌మెంటు సీటు ఒక‌టి. అన్నిస‌ర్వేల్లోనూ.. ఈ గుంటూరు పార్ల‌మెంటు స్థానాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తుండ‌డ‌మే విశేషం. ఇక్క‌డ నుంచి  టీడీపీ త‌ర‌పున జిల్లాకే చెందిన‌ ఎన్నారై నాయ‌కుడు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ పోటీ చేస్తున్నారు. తెనాలికే చెందిన పెమ్మ‌సాని గ‌తంలో ఎప్పుడూ.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో లేరు. అయితే టీడీపీ నుంచి గుంటూరు పార్ల‌మెంటులో వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన‌ ప్ర‌స్తుత ఎంపీ గల్లా జ‌య‌దేవ్ ఆక‌స్మికంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు చేసిన ప్ర‌క‌ట‌న త‌ర్వాత చంద్ర‌శేఖ‌ర్ పేరు చంద్ర‌బాబు తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చారు.
 
తొలి రోజుల్లో చంద్ర‌శేఖ‌ర్‌పై పెద్ద‌గా ఆశ‌లు లేవు. అయినా రోజులు గ‌డుస్తోన్న కొద్ది ఆయ‌న స్పీచ్‌లు, విజ‌న్ విష‌యంలో... అటు గుంటూరు పార్ల‌మెంటు అభివృద్ధి విష‌యంలో... ఇక్క‌డ ప్ర‌జ‌ల విష‌యంలో ఆయ‌న‌కు ఉన్న క్లారిటీ ప్ర‌తి ఒక్క‌రిని ఎట్రాక్ట్ చేస్తోంది. ఇన్నేళ్ల పాటు ఆయ‌న లోక‌ల్‌గా లేక‌పోయినా కూడా పెమ్మ‌సాని తెలుగు రాజ‌కీయాల‌పై చేస్తోన్న ప్ర‌సంగాలు, ఆయ‌న‌కు ఉన్న ప‌ట్టు.. తెలుగు భాష ప‌ట్ల ఉన్న అభిమానం ఇవ‌న్నీ మాస్ ను .. ఇటు క్లాస్‌ను కూడా ఆక‌ర్షిస్తున్నాయి.

వైసీపీకీ ఫేవ‌ర్‌గా ఉండే సంస్థ‌లు కూడా ఇక్క‌డ పెమ్మ‌సాని గెలుస్తాడ‌ని చెపుతున్నాయి. తాజాగా ఓ సంస్థ స‌ర్వే పెమ్మ‌సాని గెలుస్తాడ‌ని చెప్ప‌డంతో పాటు ల‌క్ష పై చిలుకు ఓట్ల మెజార్టీ మినిమంగా ఉంటుంద‌ని కూడా తేల్చేసింది. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తోన్న కిలారు వెంక‌ట రోశ‌య్య అస్స‌లు పెమ్మ‌సానికి పోటయే కాద‌ని కూడా చెప్పేసింది. ఏదేమైనా ఓవ‌రాల్‌గా ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీ డ్యామ్ షూర్ గా ల‌క్ష నుంచి 2 ల‌క్ష‌ల ఓట్ల‌తో గెలిచే సీటు ఏదంటే అది గుంటూరే అని ప్ర‌తి ఒక్క‌రు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: