ఉభ‌య గోదావ‌రి లో ఎగిరే జెండా ఎవ‌రిది... ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ' ఇండియా హెరాల్డ్ ' సెన్షేష‌న‌ల్ స‌ర్వే..!

RAMAKRISHNA S.S.
- హెరాల్డ్ స‌ర్వేలో కూటమికి 18 సీట్ల‌లో విన్నింగ్ ఛాన్స్‌.. వైసీపీకి 5
- 11 సీట్ల‌లో హెరాహోరీ... కూట‌మి ఓట్లు ప‌క్కా ట్రాన్స్‌ఫ‌ర్ అయితే స్వీపే
- 2 ఎంపీ సీట్ల‌లో కూట‌మి విక్ట‌రీ... 3 చోట్ల హోరాహోరీ
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ఎన్నికల సంగ్రామం మామూలుగా లేదు. నామినేషన్ల పర్వం ముగియడంతో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం హోరెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పే ఉమ్మడి గోదావరి జిల్లాలలో పరిస్థితి ఎలా ఉంది ? అన్నది పరిశీలిస్తే ఇక్కడ కూటమి ప్రభావం చాలా గట్టిగా కనిపిస్తోంది. బిజెపికి గోదావరి జిల్లాలలో అంత బలం లేకపోయినా అర్బన్ ఓటర్లలో కాస్త కూస్తో ఓటింగ్ ఉంది. ఇక జనసేన - టిడిపి కలయిక గోదావరి జిల్లాలలో పూర్తి ఆధిపత్యం చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా హెరాల్డ్ టీం చేసిన సర్వేలో ఉపయోగ గోదావరి జిల్లాలలో ఉన్న 34 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలలో ఎవరి ప్రభావం ఎలా ఉందో చూద్దాం.

ఇండియా హెరాల్డ్ స‌ర్వే ప్ర‌కారం ప‌శ్చిమ గోదావ‌రిలో 15, తూర్పు గోదావ‌రిలో 19 మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్లో కూట‌మికి 18 సీట్ల‌లో గెలుపు అవ‌కాశాలు ఖ‌చ్చితంగా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో కూట‌మికి ఈ సీట్ల‌లో గెలిచేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక వైసీపీకి ఖ‌చ్చితంగా 5 స్థానాల్లో గెలిచే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. మ‌రో 11 స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోరు క‌నిపిస్తోంది. ఈ 11 స్థానాల్లో ఎవ‌రు గెలిచినా ఆధిక‌త్యం చాలా స్వ‌ల్పంగా ఉండే ఛాన్సులే ఉన్నాయి.

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో అయితే గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు వ‌చ్చిన 15 శాతం ఓట్లు స‌రిగా కూట‌మికి ట్రాన్స్‌ఫ‌ర్ అయితే అస‌లు వైసీపీ అభ్య‌ర్థులు తుపాకీ దెబ్బ‌కు కూడా దొర‌క‌రు అన్నంత వాతావ‌ర‌ణం ఉంది. కూట‌మి ఎంత గ‌ట్టిగా ఉన్నా ప‌శ్చిమ‌లో పోల‌వ‌రం, తూర్పులో తుని, అన‌ప‌ర్తి, రంప‌చోడ‌వ‌రం సీట్ల‌లో వైసీపీకే గెలుపు అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక ఎంపీ సీట్ల‌లో రెండు చోట్ల కూట‌మికి ఎడ్జ్ ఉంటే.. మ‌రో మూడు చోట్ల చివ‌రి వ‌ర‌కు చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: