బాపట్ల : మామ కోసం స్పెషల్ అట్రాక్షన్ గా సినీ హీరో..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా గురువారం మధ్యాహ్నం ప్రక్రియ పూర్తయింది. అయితే నామినేషన్లకు సంబంధించి పరిశీలన ప్రక్రియలు సీఈఓ కార్యాలయం రేపు సేకరించినుంది. అభ్యర్థులు తమ నామినేషన్లు వెనక్కి తీసుకుని అవకాశాన్ని ఈనెల 29 వరకు అవకాశం కల్పించారు.బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య నామినేషన్ ప్రక్రియ చాలా అట్టహాసంగా జరిగింది. కొండయ్య తన కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది కార్యకర్తలు, కూటమినేతలు చీరాల మండలం హస్తినాపురం లోని దేవాలయం నుండి చీరాల వరకు భారీర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో భాగంగా సినీ నటుడు నిఖిల్ రాక ప్రధాన ఆకర్షణగా నిల్చింది.అయితే సినీ నటుడు నిఖిల్ కు కొండయ్య మామ వరస కావడంతో ఆయనను గెలిపించవలసిందిగా చీరాల ప్రజలని నిఖిల్ కోరారు. చీరాలలోని గడియార స్తంభం సెంటర్లో నిఖిల్ మాట్లాడుతూ చిరునవ్వుల చీరాల కావాలి అంటే కొండయ్య గారిని గెలిపించవలసిందిగా కోరారు. ఇంజనీరింగ్ కళాశాలలా ద్వారా కొండయ్య ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అని నిఖిల్ అన్నారు.ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో నిఖిల్ వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుఫున ప్రచారం కూడా నిర్వహించారాయన. అప్పుడు వైసీపీకి సపోర్టు చేశారు కదా అని నిఖిల్‌ను ప్రశ్నిస్తే...గతంలో వైసీపీకి సపోర్ట్ చేశానంటే.. వాళ్లు మా రిలేటివ్స్ అందుకే ప్రచారంలో పాల్గొన్నాను. నేను సినిమాల్లో ఉన్నాను.. వైసీపీతో కాదు.. నేను ఒకే పార్టీతోలేను.. నా అనుకున్న వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాను. అయితే మాలకొండయ్య గారు 2009 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంతో వైసీపీలో చేరారు. అలాగే 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరడం వల్ల ఆయనకు ప్రస్తుతపు ఎన్నికల్లో చీరాల నుండి టికెట్ టిడిపి అధిష్టానం కేటాయించింది. ఈ ప్రచారంలో భాగంగా కొండయ్య గారు నన్ను గెలిపిస్తే రాష్ట్రం మొత్తం చీరాల వైపు చూసేటట్లు చేస్తానని ఆయన సభా ముఖంగా మాట ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: