ఇప్పుడు పొంగులేటి.. ఇద్దరు వియ్యంకుల ముద్దుల మంత్రి.. ఎలాగంటే?

praveen
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే పనిచేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరినీ కాదని పొంగులేటి తన కుటుంబానికి చెందిన నేతలకు టికెట్ ఇప్పించుకునేందుకు తెగ పోరాటం చేశారు. మరి ముఖ్యంగా ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో ఎన్నో రోజుల నుంచి తర్జనభజన పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే విషయంపై కన్ఫ్యూజన్ లో పడింది.

 ఎందుకంటే ఖమ్మం ఎంపీ టికెట్ తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇక తన భార్యకు కేటాయించాలని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పోటీపడ్డారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పొంగులేటి సోదరుడికి, బట్టి సతీమణికి టికెట్ కేటాయించలేదు. అనూహ్యంగా పొంగులేటి వియ్యంకుడు    రఘురాం రెడ్డికి టికెట్ కేటాయించింది. ఇలా తమ్ముడికి దక్కకపోయినా తన వియ్యంకుడు రఘురాం రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టికెట్ ఇప్పించుకున్నాడు అన్న విషయం అందరికీ అర్థమైంది.

 ఇక ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఈ సీనియర్ నేత ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వియ్యంకుల ముద్దుల మినిస్టర్ గా మారిపోయారు. ఎందుకంటే ఖమ్మం నుంచి అటు పొంగులేటి వియ్యంకుడు రఘురాంరెడ్డి పోటీ చేస్తుండగా.. ఇక మరో వియ్యంకుడు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగాడు. ఆయన ఎవరో కాదు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి. ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి వియ్యంకుడు. పొంగులేటి చిన్న కూతురు  ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి చిన్న కొడుకు కు భార్య కాగా.. పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి కొడుకు అటు మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి అల్లుడు  ఇలా ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇద్దరు వియ్యంకుల ముద్దుల మంత్రిగా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: