ఏపీ: చివరి నిమిషంలో మరో అభ్యర్థికి బిఫాం ఇచ్చిన వైసిపి..!

Divya
రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లోని  రాజకీయలలో చిత్ర విచిత్రాలు  చోటు చేసుకుంటున్నాయి..  ఎలక్షన్ సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులలో ఆందోళన కూడా మొదలవుతోంది.రోజు మార్చి రోజు మారే లోపే పార్టీ నాయకులు కూడా ఇతర పార్టీలోకి వెళుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు టికెట్ల కోసమే చాలా మంది నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లి కండువా కప్పు కుంటున్నారు. అలా నిమిషాలలోనే ప్లేట్లు ఫిరాయించిన నాయకులు చాలా మంది ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాము. ఒకవేళ ఏదైనా పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా చివరి నిమిషం వరకు బి ఫామ్ వస్తుందో రాదు అనే టెన్షన్ కూడా నాయకులలో కనిపిస్తోంది.

ఇప్పుడు తాజాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలో ఇదే జరిగింది.. నామినేషన్ దాఖలు చేసేందుకు ఈరోజే చివరి రోజు కావడంతో ఎంపీ అభ్యర్థిని మారుస్తూ వైసిపి పార్టీ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు అభ్యర్థి గా బి శేట్టి సత్యవతికి బీఫామ్ అందజేసినట్టుగా తెలుస్తోంది. మొదట వైసీపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థుల లిస్టులో ఆ సీటును బూడి ముత్యాల నాయుడు కి కేటాయించారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి వైసిపి పార్టీ మరో నిర్ణయం తీసుకుంది.

ఈ సీట్ ని సీఎం జగన్ బి శెట్టి సత్యవతికి కేటాయించారు. అనకాపల్లి పార్లమెంటులో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే చివరి నిమిషంలో వైసిపి పార్టీ ఇలా చేయడంతో అక్కడ రాజకీయ నేతలు కాస్త కుర్రుగా ఉన్నట్లుగా  వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టిడిపి పార్టీ కూడా ఎంతోమంది అభ్యర్థులను మార్చారు.. ఇప్పటికే కూడా పలు రకాల నియోజకవర్గాలలో అసంతృప్తులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. వైసీపీ పార్టీలో చాలా తక్కువ అసంతృత్తులు ఉన్నాయి.. ప్రస్తుతం అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాలలో అందరిని కలుపుకొని ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: