మొండి పట్టు పట్టిన రాజాసింగ్.. బిజెపి ఇంకేం గెలుస్తుంది?

praveen
సాధారణంగా ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన  హైదరాబాద్ స్థానంలో విజయాన్ని అని పార్టీలు లైట్ తీసుకుంటూ ఉంటాయ్. ఎందుకంటే అక్కడ ఎంఐఎం పార్టీని ఎప్పుడు విజయం సాధిస్తూ వచ్చేది. దీంతో ఇక ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఒకవేళ అభ్యర్థిగా నిలబెట్టిన డమ్మీ అభ్యర్థిని మాత్రమే ఇతర పార్టీలు నిలబెడతాయి అనే వాదన తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే జరిగిందని. కానీ బిజెపి మాత్రం ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టి అక్కడ కాషాయ జెండా ఎగర వెయ్యాలని అనుకుంటుంది.

 ఈ క్రమంలోనే హిందుత్వ వాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఎంతగానో కృషి చేస్తున్న మాధవి లతకు బిజెపి నుంచి ఎంపీ టికెట్ ఇచ్చింది అధిష్టానం. ఈ క్రమంలోనే ఆమె అటు ఓవైసీకి గట్టి పోటీ ఇస్తుందని తప్పకుండా విజయం సాధిస్తుంది అని బలమైన నమ్మకాన్ని పెట్టుకుంది   కాగా ప్రస్తుతం మాధవి లత  హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కీలక నేతగా కొనసాగుతున్న రాజాసింగ్ నుండి మాత్రం మాధవి లతకు అటు మద్దతు కరువు అవుతుంది  మొదటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.

 అయితే ఇటీవల మాధవి లత నామినేషన్ కి కూడా రాజాసింగ్ డుమ్మా కొట్టారు. హైదరాబాద్ సెగ్మెంట్ ఇన్చార్జిగా ఉన్న తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవి లతకు టికెట్ ఇచ్చారని రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారట. అందుకే మిగతా నేతలు ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరుతున్న రాజాసింగ్ మాత్రం ప్రచారంలో పాల్గొనడానికి అస్సలు ఇష్టపడటం లేదట. ఇలా తాను ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఇలాకలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే రాజా సింగ్ పాల్గొనక పోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక రానున్న రోజుల్లో ప్రచారంలో ఆయన పాల్గొనడంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అయితే రాజా సింగ్ మద్దతు లేకుండా మాధవి లత ఎంఐఎం లాంటి పార్టీకి పోటీ ఇవ్వడం కష్టమే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర నాయకత్వం దీనిపై దృష్టి సాధించిందని.. రాజాసింగ్ ను మాధవి లతతో ప్రచారంలో పాల్గొనేలా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: