డిపాజిట్ కూడా దక్కలేదు.. కానీ ఎమ్మెల్యే అయ్యాడు.. ఎలాగంటే?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా ఎన్నికల వేడి రాజుకుంది. కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతుంటే.. మరికొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎన్నికల వచ్చాయంటే రాజకీయాలు ఎంతలా వేడెక్కుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  అన్ని పార్టీలు ఒక్కసారిగా అలర్ట్ అయిపోతాయి. విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంటాయి  అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతూ ఉంటాయి.

 గెలుపు గుర్రాలను బలులోకి దింపి ప్రచార రంగంలో దూసుకుపోతూ ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా ఇలాంటి ఎలక్షన్ల ప్రచార హోరు కనిపిస్తూ ఉంది  అయితే సాధారణంగా ఎలక్షన్స్ లో పోటీ చేసిన అభ్యర్థులు ఇక భారీ ఓట్లు సంపాదించినప్పుడు మాత్రమే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు రూల్స్ ప్రకారం తక్కువ ఓట్లు వచ్చిన వారిని డిపాజిట్ కూడా దక్కించుకొని అభ్యర్థులు అని అంటూ ఉంటారు. కానీ డిపాజిట్ కూడా దక్కని నేత ఎమ్మెల్యేగా ఎంపికవ్వడం  గురించి ఎప్పుడైనా విన్నారా.

 అదేంటి డిపాజిట్ కూడా దక్కలేదంటే ఇక ఎమ్మెల్యే అవ్వడానికి ఎలా ఛాన్స్ ఉంటుంది అంటారు ఎవరైనా.. కానీ 1952 లో మాత్రం ఇలా డిపాజిట్ దక్కని అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. విశాఖ జిల్లా పరవాడలో 60,780 ఓట్లు ఉండగా 25,511 మాత్రమే పోలయ్యాయి. ఇందులో సిపిఐ పార్టీకి చెందిన అభ్యర్థి వీరభద్రంకి అత్యధికంగా 7604 ఓట్లు వచ్చాయి  అప్పటి రూల్ ప్రకారం డిపాజిట్ దక్కాలంటే పోలైన ఓట్లలో మూడవ వంతు ఉండాలి అంటే 8504 ఓట్లు రావాలి. అయితే ప్రత్యర్థి పై ఒక్క ఓటు అధికంగా వచ్చిన వారే విజేతగా అన్న కమ్యూనిస్టుల వాదనతో.. రూల్ ప్రకారం డిపాజిట్ కూడా రానప్పటికీ ఇక మిగతా అభ్యర్థులతో పోల్చి చూస్తే అత్యధిక ఓట్లు సాధించిన నేపథ్యంలో వీరభద్రం ఎమ్మెల్యేగా ఎంపికైనట్లు ఈసీ ప్రకటించింది. ఆ తర్వాత డిపాజిట్ దక్కేందుకు పోలైన ఓట్లలో ఆరవ వంతు రావాలి అని రూల్ మార్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: