కేసీఆర్ కు బిగ్ షాక్.. బిఆర్ఎస్ కు పోటీగా టిఆర్ఎస్?

praveen
గత అసెంబ్లీ ఎన్నికల్లో బంగపాటుకు గురైన బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను బరిలోకి దింపి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే ఈసారి బిఆర్ఎస్ పార్టీ అటు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లో విజయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది   2004 నుంచి ఇక్కడ గులాబీ జెండా ఎగురుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం కెసిఆర్ సొంత జిల్లా అయిన మెదక్ జిల్లాలో విజయం సాధించి గులాబీ దళపతిని దెబ్బ కొట్టాలని మిగతా పార్టీలు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయ్.

 అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయింపులతో గులాబీ పార్టీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొనగా.. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది ఆ పార్టీ. అయితే ఇక మెదక్ లో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీకి ఇక ఇప్పుడు ఊహించని ఒక భారీ షాక్ తగిలింది అన్నది తెలుస్తోంది. ఎందుకంటే బిఆర్ఎస్ అనే పేరుతో అటు ఈ పార్టీ పోటీ చేస్తూ ఉండగా ఇక బిఆర్ఎస్కు పోటీగా ఇప్పుడు టిఆర్ఎస్ బరిలోకి దిగింది. తెలంగాణ రాజ్య సమితి పార్టీ నుంచి సిద్దిపేటకు చెందిన తుపాకుల మురళి కాంతి ముదిరాజ్ ఇటీవలే నామినేషన్ దాఖలు చేశారు.

 మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ వేసారూ. ఈ క్రమంలోనే మురళి కాంతి మాట్లాడుతూ తాను గెలిస్తే చట్టసభలో బడుగు బలహీన వర్గాల గొంతుకగా మారుతాను అంటూ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పేరు మార్చడం కారణంగా ఆ పార్టీకి కలిసి రాలేదు అని ప్రచారం జరిగింది. అందుకే బిఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారుస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇక అటు ఓటు వేసే సమయంలో టిఆర్ఎస్ అని కనిపించింది అంటే ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి బిఆర్ఎస్కు బదులు టిఆర్ఎస్కు ఓటు వేసి అవకాశం ఉంది. ఇది మెదక్ స్థానంలో విజయం సాధించడం విషయంలో బిఆర్ఎస్ను ఎదురు దెబ్బ కొట్టే అంశమే అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: