వడ్డీ లేకుండా 10 లక్షల రుణం.. బాబు హామీని డ్వాక్రా మహిళలు నమ్ముతారా?

Reddy P Rajasekhar
2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి కచ్చితంగా గెలవాలనే ఆకాంక్షతో చంద్రబాబు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామంటూ చంద్రబాబు మరో సంచలన హామీని ప్రకటించారు. మహిళలను లక్షాధికారులుగా మార్చే బాధ్యతను కూటమి తీసుకుంటుందని చంద్రబాబు వెల్లడించారు.
 
పాతపట్నం, ఆముదాలవలస బహిరంగ సభల్లో భాగంగా బాబు ఈ కామెంట్లు చేశారు. తల్లికి వందనం స్కీమ్ ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయలు ఇస్తామని ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఐదేళ్లలో 90 వేల రూపాయాలు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. ఆ 90 వేల రూపాయలకు 9 లక్షల రూపాయలు చేసే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
 
మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు ఇస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మహిళకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని 4,000 రూపాయల పింఛన్ అమలు చేస్తానని బాబు చెబుతున్నారు. అధికారమే పరమావధిగా బాబు తనకు తోచిన ప్రతి హామీని ప్రకటిస్తుండగా ఇన్ని పథకాలను అమలు చేస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది బాబు అంటూ రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు.
 
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఈ హామీలను అమలు చేయకపోతే మా పరిస్థితి ఏంటని సామాన్యులు చెబుతున్నారు. హామీలను ఇష్టానుసారం ప్రకటిస్తే సరిపోదని బడ్జెట్ ను కూడా దృష్టిలో ఉంచుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. చంద్రబాబు గతంలో రుణమాఫీ సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల ఆయన ఇచ్చిన హామీలను ప్రజలు సులువుగా నమ్మే పరిస్థితులు అయితే లేవనే చెప్పాలి. బహిరంగ సభల్లో సంక్షేమ పథకాల గురించి మాత్రమే మాట్లాడుతున్న బాబు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో కూడా చెబితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: