మెగాస్టార్ ని విమర్శించే స్థాయి నీది కాదురా బ్రోకర్ సజ్జల: చంద్రబాబు

Suma Kallamadi
ఏపీలో ఎన్నికల వేడి వేసివి వేడిమిని మించిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన వయసుని మరచి మండుటెండలో సభలకు హాజరవుతున్నారు. తాజా సభలో ఆయన అధికార వైసీపీ పార్టీపైన విరుచుకు పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఆంధ్రా ప్రజల్లో మార్పు చాలా స్పష్టంగా కనబడుతోంది. మార్పు అనే భయానక వేవ్‌లో వైసీపీ నామరూపాలు లేకుండా కొట్టుకొని పోవడం ఖాయం. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడిందో అందరికీ తెలిసిందే. గంజాయిని చిన్న పిల్లలతో అమ్మించి క్షమించరాని నేరాలకు పాల్పడుతోంది ఈ ప్రభుత్వం. భూ కబ్జాలతో ఎంత మందిని దోచుకున్నారో జనాలకి బాగా తెలుసు. రేపు మళ్లీ ఇలాంటి ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాలి." అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను సజ్జలని ఉతికి ఆరేశారు. "సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం వంటి గొప్ప పార్టీని పెట్టిన వ్యక్తి ఆయన. ఆయనకు సమాజంలో ఎంతో గౌరవం, పేరు ప్రఖ్యాతలు వున్నాయి. అందుకే ఆయనికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు. అలాంటిది జగన్ సొంత పత్రిక ఆఫీస్‌లో గుమస్తాగా పని చేసిన వ్యక్తి బ్రోకర్ సజ్జలగాడు చిరంజీవి అనే మహా వ్యక్తిని విమర్శించడం ఆంధ్ర ప్రదేశ్ చేసుకున్న దురదృష్టకరం." అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన మరింతగా అధికార పార్టీపైన ధ్వజమెత్తారు. "వైసీపీ నాయకులు అహంకారంతో కొట్టుకుంటున్నారు. వారి అహంకారాన్ని దించే సమయం ఆసన్నమైంది. దళితుడిని చంపి డోర్ డెలివరి చేసిన వారి పాపం వట్టికే పోదు. సభ్య సమాజం తలదించుకునేలా పవన్ కల్యాణ్‌ని బూతులు తిడుతున్నారు. మేమెప్పుడైనా మీ భార్య విషయం మాట్లాడామా? మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడామా? మీరు మాత్రం అసెంబ్లీలో మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతారు. పవన్ కల్యాణ్ ఎక్కడ? సైకో జగన్ ఎక్కడ? నక్కకి, నాగలోకానికి ఉన్న తేడా వుంది. ఇక రఘురామ కృష్ణంరాజును పోలీసులతో దాడి చేయించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థ పని చేయడం లేదు." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: