మాస్‌కు య‌ర‌ప‌తినేనంటో ఎందుకంత పిచ్చి... ఆయ‌న చేసే మ్యాజిక్ ఏంటి...?

RAMAKRISHNA S.S.
- మూడు ద‌శాబ్దాలకు పైగా ప‌ల్నాడు ప్రాంతంతో చెక్కు చెద‌ర‌ని అనుబంధం
- మ‌హిళల్లోనూ మాస్ లీడ‌ర్‌గా గుర్తింపు శీను స్పెష‌ల్‌
- సీమంతాలు... ప‌సుపు కుంకుమ ప‌థ‌కాల‌తో మ‌హిళ‌ల్లోనూ మాస్ ఇమేజ్‌

( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ )
య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు.. టీడీపీ సీనియ‌ర్ నేత‌.. గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంత ముఖ ద్వారం అయిన పిడుగురాళ్ల ఉన్న గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త మూడు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయాల‌ను శాసిస్తోన్నారు. య‌ర‌ప‌తినేని ఇప్ప‌టి వ‌ర‌కు గుర‌జాల‌లో టీడీపీ నుంచి మొత్తం ఆరుసార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే మూడుసార్లు గెలిచి.. మ‌రో మూడు సార్లు ఓడిపోయారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏడోసారి అసెంబ్లీకి పోటీ ప‌డుతున్నారు. య‌ర‌ప‌తినేని గుంటూరు జిల్లా మొత్తం మీదే ఏ పార్టీ నుంచి చూసుకున్నా తిరుగులేని మాస్ లీడ‌ర్ అని చెప్పాలి.

య‌ర‌ప‌తినేనికి ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టి నుంచే మాస్ జ‌నాల‌తో క‌నెక్టివిటి బాగా ఎక్కువ‌. మాస్ లోకి ఆయ‌న విస్తృతంగా చొచ్చుకుపోతారు. దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి పేద వ‌ర్గాల్లో ఎవ‌రికి ఏ ఇబ్బంది వ‌చ్చినా వెంట‌నే స్పందించే నైజం య‌ర‌ప‌తినేని సొంతం. ఆయ‌న స్వ‌భావికంగా మాస్ మ‌నిషే. ఇక మాస్ అంటే కేవ‌లం పురుషులు మాత్ర‌మే కాదు.. మ‌హిళల్లో మాస్ జ‌నాల ప‌ట్ల కూడా య‌ర‌ప‌తినేనికి విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది. ఆయ‌న ఎమ్మెల్యే గా ఉన్న‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా గ‌ర్భిణీల‌కు సామూహిక సీమంతాలు చేయ‌డం.. అస‌లు చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు ప‌సుపు - కుంకుమ కింద న‌గ‌దు పంపిణీ చేయ‌డం కాదు... య‌ర‌ప‌తినేని యేడాది ముందు నుంచే ప‌సుపు - కుంకుమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ  మ‌హిళ‌ల్లో ఆయ‌న కంటూ మాత్ర‌మే ఉన్న ప్ర‌త్యేక‌మైన క్రేజ్ తెచ్చుకున్నారు.

య‌ర‌ప‌తినేని ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎవ‌రికి ఏ ఇబ్బంది వ‌చ్చినా వెంట‌నే స్పందించ‌డం... రైతుల‌కు నీళ్లు ఇబ్బంది లేకుండా చేయ‌డం.. అధికారుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తూ ప‌ని అయ్యే వ‌ర‌కు .. ఇంకా చెప్పాలంటే చివ‌రి ఆయుక‌ట్టు చివ‌రి రైతుకు చివ‌రి నీటి చుక్క వెళ్లే వ‌ర‌కు ఫాలో అప్ ఆగ‌దు. అదే ఆయ‌న్ను అటు రైతుల్లో.. ఇటు మ‌హిళ‌ల్లో.. ఇత‌ర పేద వ‌ర్గాల్లో తిరుగులేని మాస్ హీరోగా నిల‌బెట్టింది. విచిత్రం ఏంటంటే ఆయ‌న చేసిన సీమంతాలు, ప‌సుపు, కుంక‌మ కార్య‌క్ర‌మాలు.. ఆయ‌న ఓడిపోయాక బాగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. అవే ఈ సారి ఆయ‌న‌కు ఎన్నిక‌ల్లో బాగా క‌లిసి వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: