టీడీపి: మేనిఫెస్టో రెడీ.. హామీ హైలెట్స్ ఇవే..!!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.. ఈ మేరకు అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే పలు రకాల రాజకీయ పార్టీలు కూడా ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఈసారి వైసీపీ పార్టీని ఎదుర్కోవడం కోసం.. బిజెపి టిడిపి జనసేన పార్టీలు ముకుమ్మడిగా పోటీ చేస్తున్నాయి. కూటమి తరపు నుంచి మేనిఫెస్టోని తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది గత కొద్ది రోజుల క్రితమే టిడిపి మేనిఫెస్టోని సిద్ధం చేశారు.. వీటి కంటే ముందుగా సూపర్ సిక్స్ హామీలను ప్రకటించినప్పటికీ వాటికి పెద్దగా పాపులారిటీ రాలేదు.

ఇలాంటి సమయంలోనే టిడిపి మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. బిజెపి జనసేన పార్టీల నుంచి ప్రతిపాదనలు రావడంతో పలు రకాల అంశాల పైన పరిశీలన చేసి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే విధంగా కూటమి ప్లాన్ చేస్తోంది. అయితే చంద్రబాబు ఇందులో కొన్ని సంచలన హామీలను కూడా ప్రకటించారనే వార్తలు వినిపిస్తున్నాయి..
1).ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు 15 వేల రూపాయలు అందిస్తామని..
2). రైతులకు ప్రతి ఏడాది 20వేల ఆర్థిక సహాయం చేస్తామని.
3). ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీగా పంపిణీ చేస్తామని.
4). అలాగే టీడ్కో ఇల్లు ఉచితంగా అందజేస్తామంటూ.
5). పించినినీ 4వేల రూపాయలు పెంచుతూ ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తామంటూ.
6). పేదలకు ఇళ్లస్థలం ఇస్తామంటూ తెలియజేశారు.
వీటితో పాటు యువత భవిష్యత్తు బాగుండాలి అంటే కూటమి అధికారంలోకి రావాలని.. ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలి అంటే కూటమి అధికారంలోకి రావాలని ప్రభుత్వ హాస్పిటల్ లోని మెరుగైన వైద్యం కూడా అందిస్తామని.. ప్రతి ఒక్కరూ ఓటు వేసేటప్పుడు మంచి వ్యక్తులను ఆదరిస్తే ప్రజలు బాగుంటారని కూడా చంద్రబాబు వెల్లడించారు. మరి మేనిఫెస్టో లో మరిన్ని పథకాలు ఉంటాయో అంటూ టిడిపి కార్యకర్తలు అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: