మాస్ లీడర్ పేరెత్తితే గుర్తొచ్చే నేత బాలయ్య.. ఆ విషయాల్లో ఎవరూ సాటిరారుగా!

Reddy P Rajasekhar
సాధారణంగా సినిమాలు, రాజకీయాలు వేర్వేరు రంగాలు కాగా ఈ రెండు రంగాలలో సక్సెస్ సాధించిన వ్యక్తులలో నందమూరి బాలయ్య ముందువరసలో ఉంటారు. మాస్ లీడర్ పేరెత్తితే గుర్తొచ్చే నేత బాలయ్య మాత్రమేనని హిందూపురం ప్రజలు చెప్పుకుంటారు. హిందూపురం వాసులకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆ సమస్యలను పరిష్కరించడం కోసం బాలయ్య అధికారులను ప్రశ్నించడంతో పాటు సొంత డబ్బులను ఖర్చు చేసి ప్రజలకు మేలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
 
అదే సమయంలో వైసీపీపై మాస్ పంచ్ లు పేల్చడంలో సైతం బాలయ్యకు ఎవరూ సాటిరారనే టాక్ ఉంది. సాధారణంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా సినిమాలలో డైలాగ్స్ ఉంటే రిస్క్ అని అందరూ భావిస్తారు. అయితే బాలయ్య సినిమాలలో మాత్రం జగన్ సర్కార్ పాలనను విమర్శించే విధంగా ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. ప్రజల మంచి కోసం ఆలోచించే విషయంలో బాలయ్యకు ఎవరూ సాటిరారని ఆయన అభిమానులు సైతం చెబుతున్నారు.
 
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెడితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే రేంజ్ కు చేరుకుంటారని అభిమానులు ఫీలవుతున్నారు. ఏపీలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ఎమ్మెల్యే బాలయ్య మాత్రమే అని చెప్పడంలో కూడా సందేహం అవసరం లేదు. సాధారణంగా టాలీవుడ్ హీరోలు ఔట్ డోర్ షూటింగ్స్ కు ఆసక్తి చూపరు. అయితే బాలయ్య మాత్రం తనకు ఔట్ డోర్ షూటింగ్స్ అంటే ఇష్టమని ప్రజల మధ్య షూటింగ్ జరిగితే ఆ సందడి వేరే లెవెల్ లో ఉంటుందని చెబుతారు.
 
నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తారని అభిమానులు ఫీలవుతున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందేలా చేస్తున్న బాలయ్య ఎవరికైనా వైద్య సహాయం అవసరమని తెలిస్తే తక్షణమే స్పందిస్తున్నారు. బాలయ్యపై కొన్ని విమర్శలు ఉన్నా ఆ విమర్శలు చంద్రునిలో ఉండే మచ్చలాంటివని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మాస్ లీడర్ ఈ ఎన్నికల్లో ఎంత మెజార్టీతో ఎమ్మెల్యే అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: