చిరంజీవి: మొహమాటమే కొంపముంచుతోందిగా..?

Divya
గత కొన్నేళ్లుగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ తాను కేవలం సినిమాలను తీసుకుంటూనే ఉంటానట్టు ప్రకటించారు. వాస్తవానికి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నారు.. రాజకీయాలలోకి ఇటీవలే అడుగుపెట్టారు.. అడుగుపెట్టిన తర్వాత ఒక వివాదాన్ని ఫేస్ చేయవలసి ఉన్నది.. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం. అప్పటివరకు చిరంజీవికి ఉన్నటువంటి క్రెడిబిలిటీకి ఇది మైనస్ గా మారిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చిరంజీవి కారణంగానే ఆరోజున కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడం.. రాష్ట్ర విభజన జరగడం కూడా జరిగిందట. అలాంటి కొన్ని నిందలు చిరంజీవి నెత్తిమీద పెట్టుకున్నారు కాబట్టే దీంతో చిరంజీవి రాజకీయ సన్యాసం తీసుకోవడం జరిగింది.
అయితే మరి చిరంజీవికి మొహమాటం ఎక్కువ అయిందో లేదో తెలియదు కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. అందుకే మొన్న ఋతురాజు పద్మ రాజు ప్రతిసారి చెబుతున్నారు మా దాంట్లో క్రియాశీలక సభ్యుడు అలాగే ఉన్నారని తెలియజేస్తూనే ఉన్నారు.. అయితే ఇంతలోనే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు పదేపదే మద్దతు ప్రకటిస్తున్నారని విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ అభిమానులు గడిచిన కొద్ది రోజుల క్రితం చిరంజీవి పైన కోపగించారు.

ముఖ్యంగా సీఎం జగన్ ను చిరంజీవి కలవటం.. సినీ ఇండస్ట్రీకి సంబంధించి పెద్దరికంగానే కలిశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరుని ప్రదర్శించిన తీరును చూసి.. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని రైజ్ చేసి.. అంతేకాకుండా తన అన్నని జగన్  అవమానించారంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాజాగా చిరంజీవి.. సీఎం రమేష్, పంచకర్ల రమేష్ ఈ ఇద్దరిని కూడా గెలిపించమంటు మద్దతు ప్రకటించడంతో మరొక వివాదం తెర మీదికి వచ్చింది. అయితే ఇప్పటివరకు చిరంజీవి జోలికి వెళ్ళని వైయస్సార్ పార్టీ నాయకులు.. ఇప్పుడు మెగాస్టార్ ని టార్గెట్ చేస్తున్నారు. నటుడు పోసాని లాంటివారు ముఖ్యంగా కాపులైనటువంటి చిరంజీవి గారు కాపులకు చేసిందేంటి అంటూ అడుగుతున్నారు. అయితే ఇలాంటి గొడవలు రాకూడదని చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారట.

మొదట చిరంజీవి ఆ ఇద్దరు నేతలకు మద్దతు తెలపడం.. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకుని చిరంజీవిని ఏమన్నా అంటే ఊరుకోనని చెప్పడం.. ఫస్ట్ స్టేట్మెంట్ చిరంజీవి ది.. ఆ తర్వాత సజ్జల రామకృష్ణ ది.. ఎంతమంది వచ్చినా సింహం సింగల్ గానే వస్తుందంటూ తెలియజేశారు.. ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ సజ్జల నిన్ను అంతు చూస్తాను అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న చిరంజీవి.. మొహమాటం వల్లే ఈ స్టేజ్ కి తీసుకువచ్చింది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: