వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్టులివే.. అమ్మఒడి రూ.20000, పింఛన్ రూ.5000.. కానీ?

Reddy P Rajasekhar
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రంలో మరోమారు అధికారంలోకి రావడం కోసం మ్యానిఫెస్టోపై ఆధారపడుతోంది. ఎన్నికలకు కేవలం 3 వారాలు ఉన్న సమయంలో వైసీపీ మ్యానిఫెస్టోను విడుదల చేయడానికి సిద్ధం కావడం గమనార్హం. అయితే వైసీపీ మ్యానిఫెస్టోలోని హామీలు ఇవేనంటూ కొన్ని హామీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మఒడి స్కీమ్ ద్వారా ఇచ్చే మొత్తాన్ని వైసీపీ 20000 రూపాయలకు పెంచనుందని తెలుస్తోంది.
 
పింఛన్ ను కూడా 5000 రూపాయలకు పెంచి దశల వారీగా పెంపును అమలు చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉందని భోగట్టా. లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించాలని జగన్ భావిస్తున్నారని ఈ ఎన్నికల్లో ఈ హామీ బ్రహ్మాస్త్రంగా పని చేస్తుందని వైసీపీ భావిస్తుందని తెలుస్తోంది. అయితే బడ్జెట్ లెక్కలను పరిశీలించి అమలుకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉండే హామీలను వైసీపీ ప్రకటించనుంది.
 
నవరత్నాల పథకాలలో భారీ పెంపు ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమికి డేంజర్ బెల్స్ లా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని సమాచారం. మహిళలకు ఉచిత బస్సు, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు లాంటి పథకాలను ప్రకటించాలనే ఆలోచనలో వైసీపీ లేదని సమాచారం అందుతోంది. జగన్ వచ్చేవారం నుంచి మరికొన్ని వ్యూహాలతో ముందుకెళ్లనున్నారని సమాచారం.
 
కూటమికి విజయావకాశాలు తగ్గించేలా జగన్ ప్లాన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. బెజవాడలో జగన్ పై జరిగిన రాయి దాడి ప్రజల్లో ఆయనపై సానుభూతిని పెంచిందని సమాచారం అందుతోంది. మొదట వైసీపీకి వ్యతిరేకంగా సర్వేలు ఇచ్చిన సంస్థలు సైతం ఇప్పుడు జగన్ కు అనుకూలంగా ఫలితాలు ఇస్తుండటం గమనార్హం . ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. 100కు పైగా స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తుందని సర్వేల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్ అని చెప్పలేము.  ఎన్నికల సమయానికి ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో లేదో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: