తిరుపతి: సొంత నియోజకవర్గంలోనే బాబుకు ఎదురీత..!

Divya
టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత కొన్నేళ్లుగా కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో కూడా కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సమయంలో చంద్రబాబుకు తన నియోజకవర్గం లోని ఎదురీదుతున్నారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. తన 40 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఎన్నడూ కష్టపడినంతగా ఈసారి ఎమ్మెల్యేగా గెలవడానికి చాలా పాటు పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పార్టీ పలు రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది.

గతంలో నుంచి చూసుకుంటే ప్రతిసారి కూడా చంద్రబాబుకు మెజారిటీ తగ్గుతూనే వస్తోంది. కేవలం తనకు ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉందంటూ చెప్పుకుంటూ వెళ్తున్న చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా దశాబ్ద కాలం నుంచి ఉన్న చంద్రబాబు కుప్పం గతిని మాత్రం మార్చలేదనే వాదన వినిపిస్తోంది. ఇదే చంద్రబాబు పాలిట శాపంగా మారుతోందట. గతంలో కుప్పం మున్సిపాలిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది.. ముఖ్యంగా ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో టిడిపి అభ్యర్థులే ఉన్న కుప్పం పరిధిలో టిడిపి పరువు కాపాడుకోలేకపోయారు.

ఈసారి చంద్రబాబును ఓడిస్తే టిడిపి పార్టీ పతనం అవుతుందనే విషయం వైయస్సార్ పార్టీ గ్రహించి అదే పనిలో తీవ్రమైన కతరత్తులు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు కూడా కాస్త భయపడే కుప్పానికి ప్రచారానికి వెళుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను కూడా ఎవరు ఒకరితో వేయించేవారు..కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కుప్పంలో చంద్రబాబు గెలవడం కోసం తన భార్య భువనేశ్వరి కూడా ప్రచారానికి దిగారు. మొత్తానికి కుప్పంలో చంద్రబాబు కలవరపడడానికి ముఖ్య కారణం అక్కడ ఎదురుగాలి గట్టిగానే ఉందనే వార్తలు వినిపిస్తోంది. చివరి ప్రయత్నం గా చంద్రబాబు ఈసారి కుప్పం నుంచి నిలబడడం తను చివరిసారి అనే నినాదాన్ని తీసుకు వెళుతున్నారని అక్కడ స్థానిక నేతలు కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉపయోగించుకునే పనిలో పడ్డారు. మరి చంద్రబాబు తన తెలివితేటలతో ఈసారి గట్టిగ ప్రయత్నం చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: