ఆ అమ్మాయి నాకు పోటీయే కాద‌న్నాడు... ఇప్పుడు చెమ‌ట‌లు కక్కేస్తున్నాడా వైసీపీ సీనియ‌ర్‌...!

RAMAKRISHNA S.S.
- ద‌ర్శిలో వైసీపీ బూచేప‌ల్లిని గింగ‌రాలు కొట్టిస్తోన్న టీడీపీ ల‌క్ష్మి
- ఆమె నాకు పోటీయే కాద‌ని డిఫెన్స్‌లో ప‌డ్డ వైనం
- రోజు రోజుకు శ‌ర‌వేగంగా మారుతోన్న ప‌రిణామాలు

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )
ఆమెకు టీడీపీ నుంచి సీటు వ‌చ్చిన‌ప్పుడు అస‌లామే నాకు పోటీయే కాద‌న్నాడా వైసీపీ సీనియ‌ర్ నేత‌... మాజీ ఎమ్మెల్యే. క‌ట్ చేస్తే ఆమె ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అలా అడుగు పెట్టిందో లేదో వెంట‌నే సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఆమెకు అపూర్వ స్వాగ‌తం... ప్ర‌జ‌లు బ్రహ్మ‌ర‌థం ప‌ట్ట‌డం మొద‌లు.. రోజు రోజుకు క్రేజ్ అనూహ్యంగా పెరుగుతోంది. అటా వైసీపీ సీనియ‌ర్ క్రేజ్ త‌గ్గుతూ వ‌స్తోంది. దీంతో ఆ సీనియ‌ర్ త‌న అంచ‌నాలు త‌ప్పుతున్నాయ‌ని గెలిచేందుకు చెమ‌టోడుస్తోన్న ప‌రిస్థితి. ఆ నియోజ‌క‌వ‌ర్గ‌మే ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శి. ఆ ఇద్ద‌రూ నేత‌లు టీడీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గొట్టిపాటి ల‌క్ష్మి... వైసీపీ క్యాండెట్ బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి.

వాస్త‌వానికి ఇక్క‌డ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌ను ప‌క్క‌న పెట్టేసి సీటు బ‌ల‌వంతంగా లాక్కున్నాడు బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌. పైగా శివ‌ప్ర‌సాద్ త‌ల్లి వెంకాయ‌మ్మ జ‌డ్పీచైర్‌ప‌ర్స‌న్‌గా కూడా ఉన్నారు. అంత బ‌లం ఉండి కూడా ద‌ర్శిలో ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న పొలిటిక‌ల్ జూనియ‌ర్ గొట్టిపాటి ల‌క్ష్మిపై గెలిచేందుకు ఆపసోపాలు ప‌డుతున్నారు. ఆమెకు సీటు ఇచ్చిన‌ప్పుడు ద‌ర్శిలో వార్ వ‌న్‌సైడే అని శివ‌ప్ర‌సాద్‌తో పాటు వైసీపీ వాళ్లు అనుకున్నారు.

క‌ట్ చేస్తే ఇప్పుడు ల‌క్ష్మి ప్ర‌సంగాలు.. ప‌దునైన మాట‌లు... స్పీచ్‌ల్లో వాడివేడి చూసి బూచేప‌ల్లితో పాటు వైసీపీ శ్రేణులు కూడా షాక్ అవుతున్నాయి. ఇటు ల‌క్ష్మి ఎంట‌ర్ అయ్యాక టీడీపీలో అసంతృప్తులు అన్న‌మాటే విన‌ప‌డ‌డం లేదు. విచిత్రం ఏంటంటే వైసీపీ అస‌మ్మ‌తి వ‌ర్గాల‌తో పాటు తాజా ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వ‌ర్గం కూడా ల‌క్ష్మికి స‌పోర్ట్ చేస్తోన్న ప‌రిస్థితి. అటు బూచేప‌ల్లికి వ్య‌తిరేకంగా అన్ని వ‌ర్గాలు ఏక‌మ‌వుతున్నాయి. ఇటు ల‌క్ష్మి బాబాయ్ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కూడా ల‌క్ష్మికి స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తూ అన్నివిధాలా అండ‌దండ‌లు అందిస్తున్నారు.

దీనికి తోడు అద్దంకి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆనుకున్న ఉన్న ముండ్ల‌మూరుతో పాటు వైసీపీకి ప‌ట్టున్న తాళ్లూరు లాంటి మండ‌లాల్లో రోజురోజుకు వైసీపీ గ్రాఫ్ బాగా డౌన్ అవుతూ.. టీడీపీ గ్రాఫ్ పెరుగుతూ వ‌స్తోంది. ద‌ర్శి టీడీపీకి ఇప్పుడు సామాజిక‌, ఆర్థిక‌, అంగ బ‌లాల ప‌రంగా మ‌హిళా క్యాండెట్ దొర‌క‌డంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ మామూలుగా లేదు. ఇటు మ‌హిళ కావ‌డం కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా ల‌క్ష్మికి చాలా ప్ల‌స్ అవుతోంది. ఏదేమైనా ద‌ర్శిలో గొట్టిపాటి ల‌క్ష్మి రాజ‌కీయాల‌కు కొత్తే అయినా వ‌న్స్ ఎంట‌ర్ అయ్యాక మాత్రం వైసీపీకి ద‌బిడి దిబిడి మోత మోగించేస్తోంది నిజం.. మ‌రి రేప‌టి ఫ‌లితాల్లో ఆమె ఏం చేస్తుంద‌న్న‌దే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: