జగన్‌కు లోకేశ్‌ చెక్‌: ఎన్నారైలతో సూపర్‌ ప్లాన్‌?

Chakravarthi Kalyan
సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నారైలు ఏపీలో అడుగు పెట్టారు. చంద్రబాబుని సీఎ చేయడమే లక్ష్యంగా ఎన్నికల క్షేత్రంలోకి దూకేందుకు సిద్ధం అవుతున్నారు. దాదాపు 1500మంది ఎన్నారైలు 125 దేశాల నుంచి ఏపీకి చేరుకున్నారు. తమ స్వస్థలాల్లో వీరు ఎన్డీయే అభ్యర్థులు విజయం కోసం కష్టపడబోతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రభావితం చేసే అంశంపై మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్ఆర్ఐ విభాగం తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఇందులో జగన్ ని ఎలా గద్దె దించాలి. . చంద్రబాబు ని ఎలా సీఎం చేయాలి అనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఎన్ఆర్ఐ లలో కూడా అదే పట్టుదల కనిపిస్తోంది. ఏపీలో అభివృద్ధి ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని.. ఇలాంటి సమయంలో రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని గట్టెకిస్తారు అని టీడీపీ నాయకులు వారికి హిత బోధ చేశారు.

చంద్రబాబు పాలనలో ఎన్ఆర్ఐలతో పాటు రాష్ట్రంలో ప్రజల ఆస్తులు పెరిగాయని.. వైసీపీ పాలనలో జగన్ ఆస్తులు, ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలవే పెరిగాయని టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ విభాగం భావిస్తోంది. ఇదే విషయాన్ని వారికి చెప్పింది. దీంతో వీరంతా మందు సోషల్ మీడియాని ఆయుధంగా మలచుకొని ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా నారా లోకేశ్ విదేశీ పర్యటనలు చేసిన సమయంలోనే వీరికి తమ పార్టీ దారిలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. జగన్ పార్టీపై అక్కడ దుష్ప్రచారం చేసి వీరిని తమ వైపు తిప్పుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా వారికి నారా లోకేశ్ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ముందు పార్టీ కోసం ఒక రూ.300 కోట్లు విరాళాలు అవసరం అని.. ఆ తర్వాత విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి తాము అధికారంలోకి వస్తే మూడింతల మేలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు అని ఎన్ ఆర్ఐ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు ఎన్ఆర్ఐలకు వైసీపీ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో వీరంతా టీడీపీకి అనుకూలంగా ఉండి.. మరింత ఉత్సాహంగా ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ప్లాన్లు ఏ మేరకు ఫలిస్తాయో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: