ఆ 147 పాయే నంటున్న బాబోరు : వీడియో సాక్ష్యం?

Divya
2024 ఎన్నికలు అటు టీడీపీ , వైసీపీ పార్టీ మధ్య చాలా రసవత్తంగా మారుతున్నాయి.. ఈసారి ఎన్నికలలో మేము గెలుస్తామంటే..  మేము గెలుస్తామనే విధంగా ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పలు రకాల సర్వేలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం పైన స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ అంతర్గత సమావేశంలో వైసీపీ గెలుపు పైన ఒక చర్చ జరిగినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

టీడీపీ అంతర్గత సమావేశాలలో వైసీపీ గెలుపు అంచనాల పైన సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. 175 సీట్లలో వైసీపీ పార్టీ కి 147  సీట్ల బలం ఉందంటూ.. ప్రజెంటేషన్ టీడీపీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో వచ్చిన ఓట్లకు అదనంగా మరో రెండు శాతం ఓట్లు సాధించాలి  అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టిడిపి నేతలకు దిశా నిర్దేశం చేస్తున్న టిడిపి స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేట్ కోనేరు సురేష్ ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.

2014లో టీడీపీ కి 47.7 శాతం వోటు శాతం వచ్చింది.. వైసీపీకి 45.67 శాతం వచ్చింది.. ఓవరాల్ గా చూసుకుంటే ఒకటి రెండు పర్సంటేజ్ తేడాలలోనే 2014లో టిడిపి పార్టీ విన్ అయిందని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ఓట్లు చీలిన మూలాన కేవలం 23 సీట్లు మాత్రమే గెలిచామంటూ తెలిపారు. లేకపోతే మినిమం 65 సీట్లలో గెలిచే వాళ్ళమంటూ సురేష్ వెల్లడించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న  147 సీట్లలో.. కూటమికి,  వైసీపీ పార్టీకి కేవలం 5% మాత్రమే ఓటింగ్ తేడా ఉందంటూ వివరించారు. అంటే టిడిపి,  వైసిపి మధ్య రెండు శాతం తేడా ఉందని వివరించారు.. 2019 ఓట్లను గుర్తుంచుకొని.. ఒక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 నియోజవర్గాలలో గెలవచ్చు అంటూ సురేష్ వెల్లడించారు. ముఖ్యంగా 28 నియోజకవర్గాలలో కడప,  కర్నూలు ప్రాంతాలలో కూటమికి , వైసిపి పార్టీకి దాదాపుగా 10 లక్షల ఓట్లు తేడా ఉన్నట్లు తెలిపారు. అక్కడ టిడిపికి చాలా వ్యతిరేకత ఉందంటూ కూడా వెల్లడించారు. ఈ నియోజకవర్గాలలో పట్టు బిగిస్తే.. గెలిచే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపినట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: