వామ్మో.. చంద్రబాబు ఆస్తుల లెక్కలు చూస్తే దిమ్మతిరగాల్సిందే?

Divya
ఆంధ్రాలో రాజకీయాలు రోజురోజుకి ఉప అందుకుంటున్నాయి. ముఖ్యంగా  నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. దీంతో చాలా మంది నేతలు నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. టిడిపి అధినేత చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ ని భువనేశ్వరి సమర్పించింది. అయితే ఎన్నికల అఫీడవిట్ లో చంద్రబాబు ఆస్తులు వివరాలను కూడా తెలియజేశారు. గడచిన ఐదేళ్లలో చంద్రబాబు ఆస్తి విలువ సుమారుగా 39% పెరిగినట్లుగా చూపించారు. బాబు ఆస్తి విలువ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.. ప్రస్తుతం చంద్రబాబు ఆస్తి విలువ రూ.931 కోట్ల రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్లో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ మొత్తం ఆస్తులలో చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆస్తి 668 కోట్లు ఈమె పేరుతో ఉన్నట్లు తెలియజేశారు. అయితే ఇవన్నీ కూడా హెరిటేజ్ ఫుడ్స్, ఇతరత్రా బిజినెస్ లాంటి వాటిలో పెట్టుబడులుగా ఉన్నట్లు తెలియజేశారు. అలాగే భువనేశ్వరి దగ్గర మూడు కోట్ల రూపాయలు విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉన్నట్లు వెల్లడించారు. వీటితోపాటు తమిళనాడు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఇతరత్న ప్రాంతాలలో పొలాలు ఇల్లులు ఉన్నట్లుగా కూడా తెలియజేశారు. చంద్రబాబు.. లోకేష్ తో కలిసి చంద్రబాబు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3.48 కోట్లు లోన్ తీసుకున్నట్లు  చూపించారు.

చంద్రబాబు కేసుల విషయానికి వస్తే తన మీద 24 క్రిమినల్ కేసులో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అమరావతి రాజధాని ల్యాండ్ పోలింగ్ స్కామ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్  వంటి వాటిలో కూడా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఆస్తి ఈ ఐదేళ్ల 39%  పెరిగింది. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని అందుకోసం చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు. అధికార పార్టీ వైసీపీని ఎదుర్కోవడం కోసం అటు బిజెపి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఈసారి  ఎన్నికల బరిలో నిలువబోతున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఆస్తి ఇన్ని కోట్లు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: