సర్వేల ఫలితాలు.. ఏ పార్టీ గెలుస్తుందో తెలిసిందిగా?

Chakravarthi Kalyan
ఏపీలో ఆఖరుకు రాజకీయం ఎంతదాకా వచ్చిందంటే సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొని ప్రచారం చేసుకునే పరిస్థితి కి వచ్చింది. జనాలు సర్వేలను నమ్మి ఫలానా పార్టీ గెలుస్తుందని ఓట్లు వేస్తారా అలా అయితే ప్రతి వారు పెయిడ్ సర్వేలు చేయించుకొని గెలుస్తారు కదా. ప్రస్తుతానికి ఇది గెలుపునుకు దగ్గర దారి అంటున్నారు విశ్లేషకులు. మాకు ఇన్ని సర్వేలు  అనుకూలం  అని ఒక పార్టీ పదే పదే చెప్పడం.. దానికి కౌంటర్ గా మా నంబర్ ఇంతకన్నా ఎక్కువ అని మరో పార్టీ చెప్పుకోవడం పరిపాటిగా మారింది.

మొత్తం మీద జనాల ఆసక్తిని గమనించి చివరకు సర్వేల ద్వారా కూడా ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సిద్ధం అవుతున్నారు. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిర్వహించిన టీడీపీ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ కూటమికి అనుకూలంగా పదకొండు సర్వేలు వచ్చాయని.. అంకెలతో సహా సీట్లు వివరిస్తూ గర్వంగా చెప్పారు. మేమే గెలవబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా ఓటరు మనసును మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా చాలా సర్వేలు వచ్చాయి. చివరిగా వచ్చిన 11 సర్వేలను చూసుకున్నట్లయితే.. ఆ పదకొండింటిలో కూటమికి 23 ఎంపీ స్థానాలు గెలుస్తాయని చెప్పాయన్నారు. అంతే కాదు పోలింగ్ తర్వాత మళ్లీ సర్వేలు వస్తాయని చెప్పారు.

ఏపీలో రాజకీయం పూర్తిగా టీడీపీ కూటమికి అనుకూలంగా ఉందని.. చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా ఇదే విషయాన్ని టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దీనిపై వైసీపీ కౌంటర్ ఇస్తూ.. మాకే ఎక్కువ సర్వేలు అనుకూలంగా ఉన్నాయని.. అధికారంలోకి వచ్చేది మేమే అని బలంగా చెబుతోంది. ఇదిలా ఉండగా సర్వేలతోనే పార్టీలు నెగ్గుతాయా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్, కర్ణాటకలో బీజేపీ గెలవాలని కానీ ఈ రెండు పార్టీలు ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: