కేటిఆర్ vs కిషన్ రెడ్డి.. వీళ్ళు శత్రువులే.. కానీ స్నేహితులు?

praveen
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అప్పటివరకు ఒకే పార్టీ తరఫున కొనసాగుతూ మిత్రులుగా ఉన్నవారు. ఇక చిన్న చిన్న విభేదాలతో పార్టీ మారి శత్రువులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూశాం. ఇంకొంతమంది విభేదాలు ఎన్ని వచ్చినా వాటిని సర్దుమనిగేలా చేసుకుంటూ ఇక ఒకే పార్టీలో కొనసాగుతూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇద్దరు నాయకుల రూటే సపరేటు. వాళ్ళిద్దరూ ఒక పార్టీలో లేరు. ఏకంగా పచ్చ గడ్డి వేస్తే బగ్గుబంటుంది అన్న విధంగా ఆ ఇద్దరు ఉన్న పార్టీల మధ్య వైరం ఉంటుంది.

 ఎప్పుడు చాన్స్ దొరుకుతుందా ఎప్పుడు విమర్శలతో ఏకీపారేస్తామా అన్న విధంగా ఇరుపార్టీల నేతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా  శత్రువులుగా కొనసాగుతున్న రెండు పార్టీలలో కొనసాగుతున్న ఈ ఇద్దరు నేతలు మాత్రం మిత్రులుగా కొనసాగుతున్నారు. ఇదే ఎప్పుడూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తనయుడు ప్రస్తుతం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్.. ఇక బిజెపి ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వీరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతుంది.

 వీరిద్దరి పార్టీలు వేరు. ఆ పార్టీల సిద్ధాంతాలు కూడా వేరు.. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు ఇరు పార్టీల నేతలు. కానీ ఈ ఇద్దరు నాయకులు మధ్య మాత్రం ఇలాంటి విమర్శలు కనిపించవు. ఒకరి కోసం ఒకరు నిలబడుతూ ఉంటారు. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిజెపి పుంజుకుంటుందేమో అని భయపడి.. తన స్నేహితుడైన కిషన్ రెడ్డిని కేటీఆర్ తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా తెచ్చుకున్నాడు అనే వాదన తెలంగాణ రాజకీయాల్లో గట్టిగా వినిపించింది. ఇక ఇప్పుడు సికింద్రాబాద్లో తన స్నేహితుడు కిషన్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టేందుకు కేటీఆర్ డమ్మి అభ్యర్థిని నిలబెట్టాడు అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఇలా పైపైకి వీరిద్దరూ తూతూ మంత్రంగా విమర్శలు చేసుకున్న అంతర్గతంగా మాత్రం వీరిద్దరి మధ్య బలమైన స్నేహబంధం ఉంది అన్నది చాలామంది తెలంగాణ ప్రజలు చెబుతున్న మాట. ఇలా పైకి కనిపించేందుకు రెండు పార్టీల్లో ఉన్న ఇద్దరు నాయకులు శత్రువులే అయినా.. ఎవరికి కనిపించని మిత్రులు అన్నది ఎన్నో రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: