ఎన్నికల తర్వాత మోడీ ఫ్యూచర్‌ ఇంత దారుణంగా ఉంటుందా?

Chakravarthi Kalyan
లోక్ సభ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. జూన్ 1 వరకు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4 ఎవరు విజేతనో తెలిసిపోతుంది. అయితే ఈ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధించాలనే లక్ష్యం నిర్దేశించుకుంది. ఆ పార్టీ ఏమో 370 సీట్లకు పైగా సాధిస్తామనే నమ్మకంతో ఉంది.

అయితే బీజేపీ ఈ లక్ష్యం సాధిస్తుందా లేదా అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి 150 కి మించి సీట్లు రావని తేల్చి చెప్పారు. మేం గతంలో ఆ పార్టీకి 180 సీట్లు వస్తాయని అంచనా వేశాం. కానీ ఇండియా కూటమికి ఆదరణ పెరుగుతోంది. దీంతో ఆ పార్టీ 150 సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని జోస్యం చెప్పారు.

మరి మోదీ చెబుతున్న లెక్కలు.. రాహుల్ గాంధీ చెబుతున్న లెక్కలను పరిశీలిస్తే.. గతంలో బీజేపీకి 303 సీట్లు దక్కాయి. ఇతర పార్టీల అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను సాధించింది. ఈసారి  ఆ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు అదనంగా సీట్లు సాధించాలి. గతంలో కర్ణాటకలో 24 సీట్లు రాగా ఈసారి అక్కడ అధికారం కాంగ్రెస్  చేతిలో ఉంది కాబట్టి సీట్లు తగ్గే అవకాశం ఉంది.

తెలంగాణలో రెండెంకల సీట్లు సాధించాలి. ఏపీ బీజేపీ పరిస్థితి దయనీయం. ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీకి సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. తమిళనాడులో రెండెంకల ఓట్లు వస్తాయి కానీ.. సీట్లు ఏ మేర వస్తాయో చెప్పలేం. హరియాణాలో సిట్టింగ్ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ లో చేరారు. గుజరాత్, రాజస్థాన్ లో స్థానిక పరిస్థితుల నేపథ్యంలో గతంలో లాగా క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ గతంలో వచ్చిన సీట్లు నిలబెట్టుకోవడమే కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: