తెలంగాణ: బీఆర్ఎస్ పై నమ్మకం లేదు.. KTR బావమరిది కాంగ్రెస్ లోకి జంప్.!

Pandrala Sravanthi
మనం ఏం చేసినా,  ఎంత విర్రవీగిన కాలం అనేది దేనికైనా సమాధానం చెబుతుంది. ఇక ఇలాంటి ఘటనలు రాజకీయాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. పది సంవత్సరాలు ఏకధాటిగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి ప్రతిపక్షం అనే మాటను బయటకు రాకుండా చేశారు కేసీఆర్, కేటీఆర్. అలాంటి వీరు ఒక్కసారిగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖంగుతున్నారు.  అధికారాన్ని కూడా కోల్పోయారు. కనీసం ప్రతిపక్షంగా ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు. ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నాయకులంతా విడిపోయి కాంగ్రెస్ వైపు, బిజెపి వైపు వెళ్తున్నారు. ఇదే తరుణంలో బీఆర్ఎస్ లో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు తప్ప మిగతా వారెవరు ప్రభుత్వాన్ని నిందించడం లేదు. 

అంతేకాకుండా ఎంతో మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని , బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా త్వరలో కాంగ్రెస్ లోకి వస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.  ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విధంగా రాజకీయం కొనసాగుతున్న తరుణంలోనే కేటీఆర్ కు సొంత బంధువే హ్యాండ్ ఇచ్చాడు. అధికారంలో ఉన్నన్ని రోజులు తనకు రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి బావమరిది  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే ఎడ్ల రాహుల్.   మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈయన కేటీఆర్ సతీమణి శైలిమా  చిన్నమ్మ కొడుకు ఎడ్ల రాహుల్.

 ఈయన కేటీఆర్ కి కుడి భుజంలా ఉండేవారు. అలాంటి ఆయన తన సొంత పార్టీని, బావని విడిచిపెట్టి కాంగ్రెస్ లోకి వచ్చారంటే  రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఓవైపు బీఆర్ఎస్ నేతలు లోలోపల మదన పడుతూనే  పైకి మేకపోతు గాంబీర్యం ప్రవర్తిస్తున్నారని ఇలాంటి ఘటనలు చూస్తే అర్థం అవుతోంది. కేసీఆరేమో మాతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కార్యకర్తలకు కాస్త భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంటే, బీఆర్ఎస్ లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు,కీలక లీడర్లు అంతా కాంగ్రెస్ వైపు రావడానికి ఎంతో ట్రై చేస్తున్నారట. బయట వ్యక్తులు అంటే ఏమో కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులే ఈ విధంగా  పార్టీని నమ్మకుంటే  మిగతా లీడర్ల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: