ఏపీ:112 సీట్లతో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన సర్వే..!

Divya
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది.. అభ్యర్థులలో కాస్త ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా మరి కొద్ది రోజులలో జరగబోతున్నాయి. దీంతో పార్టీలు సైతం ప్రస్తుతం ప్రచార కార్యక్రమంలో చాలా హోరాహోరీగా చేస్తున్నారు. వైసిపి పార్టీ కూడా మళ్లీ ఖచ్చితంగా అధికారం తమదే అంటూ చాలా ధీమాని వ్యక్తం చేస్తున్నాయి. కానీ కూటమి మాత్రం ఈసారి జగన్ని ఓడిస్తామంటూ  తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సర్వేలు సైతం వైరల్ గా మారుతున్నాయి.

చాలా సర్వేల సైతం వైసీపీ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు సైతం తెలియజేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఎంతో క్రేజీ సంపాదించిన ప్రముఖ ఛానల్ NDTV సర్వే ఫలితాలను కూడా విడుదల చేసింది. ఇప్పటివరకు ఎన్డిటీవీలో చేసిన సర్వేలు చాలా వరకు సక్సెస్ అయ్యాయట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని తాజాగా ఈ సంస్థ ఒక సర్వేను సైతం నిర్వహించింది. ఈ సర్వేలో మరొకసారి కచ్చితంగా ఫ్యాన్ గాలి తిరుగుతుంది అంటూ తెలియజేసింది. కూటమిలో భాగంగా టిడిపి, బిజెపి ,జనసేన పోటీ చేసిన జగన్ విజయాన్ని వరిస్తోందని వెల్లడించింది.

112 సీట్లతో జగన్ మరొకసారి అధికారంలోకి వస్తారని ఈ సర్వే తెలియజేస్తోంది. వీటితో పాటు ఎంపీ సీట్లలో దాదాపుగా 16 స్థానాలు గెలుచుకుంటుందట. కూటమిలో భాగంగా 60 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తారని అంతకుమించి వచ్చే అవకాశాలు లేవని కూడా తేల్చి చెప్పింది. 9 ఎంపీ స్థానాలు కూటమి గెలుస్తుందని ఈ సర్వే వివరించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలలో అసలు ఖాతా కూడా తెరవలేదంటూ తేల్చి చెప్పింది. అయితే ఈ సర్వేలో జగన్ గెలుపుకి ముఖ్య కారణం సంక్షేమ పథకాలే అని ఈ సర్వే చెబుతోంది. అటు వైసిపి ఇప్పటికే ఇచ్చిన హామీలలో కూడా 99 శాతం అమలు చేశామంటూ తెలుపుతున్నారు. అందుకే ఈసారి కూడా వైసిపి జెండా ఎగురుతుందని పదేపదే ఎన్నో సర్వేలు తెలియజేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: