తిరుపతి: పద్మావతి గెస్ట్ హౌస్.. పెద్దిరెడ్డి గుట్టు విప్పిన.. నల్లారి..!

Divya
ఎలక్షన్ సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు మరింత ఉపునిస్తున్నాయి. సీనియర్ నేతల సైతం పోటీ పడుతున్నారు.. ముఖ్యంగా మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి , మాజీ ముఖ్యమంత్రి kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య పోరు చాలా రసవత్తంగా మారుతోంది. మాటల ఉద్యమం కూడా తారాస్థాయికి చేరుతోంది. ఇప్పుడు తాజాగా kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పెద్దారెడ్డి పైన పలు రకాల హాట్ కామెంట్స్ చేయడం జరిగింది.

నిన్నటి రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో డిసిసి అధ్యక్ష పదవి కోసం పద్మావతి గెస్ట్ హౌస్ లో పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు రెండుసార్లు పట్టుకున్నారంటూ ఆరోపించారు. ఆ సమయంలో తన నియోజకవర్గంలోని కార్యకర్తలు 50 మందికి పైగా ఉన్నారంటూ వెల్లడించారు.. తాను చెప్పేది అబద్ధమైతే.. పెద్దారెడ్డికి దమ్ముంటే.. కాణిపాకం లేదా తరికొండలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. పదవుల కోసం నల్లారి కుటుంబ సభ్యులు ఎవరి కాళ్లు పట్టుకోరు అంటూ ఎద్దేవా చేశారు.. అవినీతి పనులు, బెదిరింపులు, దోపిడీ చేయడం పెద్దారెడ్డి నైజామే అంటూ kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు.

అలాగే తాను మంత్రి పదవిని మాత్రమే ఆశించినప్పటికీ.. కొన్ని కారణాల చేత అనుకోకుండా ప్రభుత్వ విప్ అయ్యాను.. శాసనసభ స్పీకర్ అయ్యాను.. ముఖ్యమంత్రిని కూడా అయ్యానని ఇలా అనుకోకుండా అన్ని పదవులు తాను పొందానంటూ తెలియజేశారు కిరణ్ కుమార్ రెడ్డి. అసలు పెద్దారెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా అంటూ కూడా ప్రశ్నించారు.. కేవలం ఐదేళ్లు తమ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మరి మద్యం, మైన్స్ వంటి వాటిలో వేల కోట్లు సంపాదించారని తెలియజేశారు కిరణ్ కుమార్ రెడ్డి. కేవలం అధికారం ఉందని అహంకారంతో పెద్దారెడ్డి ఇలా మాట్లాడుతున్నారంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఎప్పుడు రాజకీయాలలో పద్మావతి గెస్ట్ హౌస్ మాత్రం చాలా వైరల్ గా ప్రస్తుతం మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: